ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అమర్దీప్ రిక్వ‌స్ట్‌.. మొత్తానికి దుమ్ము లేపాడుగా.. రైతు బిడ్డకి గుడ్ న్యూస్..!!

వైల్డ్ కార్డ్‌ ఎంట్రీతో ఆట భలే మారింది. పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా రీఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తో సహా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు పోటుగాళ్లుగా విభజించాడు బిగ్ బాస్. ఈ రెండు టీం ల మధ్య వరుసగా పోటీలు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇప్పటివరకు అయినా గేమ్ ప్రకారం పోటుగాళ్లు లీడింగ్ లో ఉండగా ఆటగాళ్లు కాస్త వెనుకబడ్డారు. తాజాగా నేడు కూడా మరో ఆసక్తికరమైన గేమ్ ఇచ్చాడు. ఇందులో బిగ్ బాస్.. సినిమా నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగాడు.

కొన్ని డైలాగులు వినిపిస్తూ ఆ సమయంలో వాడిన ఆయుధాలు ఏంటి? అని అడిగాడు. అలాగే పాటలు వినిపిస్తూ అందులో ఉన్న హీరోయిన్ ఎవరు అని అడిగాడు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ప్రకాష్ రాజును కొట్టిన ప్లేస్ ఏంటని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రైతుబిడ్డ క్షణం ఆలోచించకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టాడు. గత కొద్ది రోజులుగా డల్ గా కనిపిస్తున్న అమర్దీప్ ఈ ఆటలో అద్భుతంగా ఆడడమే కాక బాగా పెర్ఫార్మ్ కూడా చేశాడు. శివాజీ పదేపదే నువ్వు ఆడ లేవు, ఆడటం లేదు.. అంటూ అమర్ నమ్మకాన్ని దెబ్బతీస్తూ వచ్చాడు.

మొదటినుంచి ఇలాంటి మాటలు వింటూ వస్తున్న అమర్ తనను డిపెండ్ చేసుకోవడం కూడా మానేసి మానసికంగా కుంగిపోయాడు. ఫలితంగా ఆట మీద కూడా ఫోకస్ చేయలేకపోయాడు. అయితే తాజా టాస్క్ లో మాత్రం తనకు చాన్స్ రావడమే కాకుండా దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. మరోవైపు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీని లాగేసుకున్న బిగ్ బాస్ దాన్ని తిరిగి ఇచ్చేశారు. దీంతో అమర్ ఆట చూసిన అభిమానులు అదరగొడుతున్నాడుగా అంటూ.. ఎంకరేజ్ చేస్తున్నారు.