మగవాళ్ళు కుంకుమపువ్వు వాడితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?

కుంకుమపువ్వు గర్భిణీలు తినాలి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ దాన్ని ఎవరైనా తినవచ్చట. దీని తినడం వల్ల కీళ్లనొప్పులు తగ్గడం, నిద్రలేమి, డిప్రెషన్, అంగస్తంభన సమస్యలకు చక్కటి ఔషధంలా పనిచేస్తాయని చెబుతున్నారు. కుంకుమపువ్వుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చర్మానికి మెరుపు తీసుకురావడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృధిగా ఉండడంతో ఎలాంటి క్రీమ్స్‌ ఉపయోగించకుండా సహజ సిద్ధంగా చర్మం మెరిసేలా చేస్తుంది.అలాగే పింపుల్స్ తగ్గించడంలోనూ కుంకుమపువ్వు ఎంతగానో సహక‌రిస్తుంది. దీనిలో ఫైటోకెమికల్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ బ్రెయిన్‌కి అవసరమైన సెరోటోనిన్ ను అందించడంలో తోడ్ప‌డ‌తాయి.

అంతేకాకుండా రుతుక్రమ సంబంధిత సమస్యలను కూడా కుంకుమపువ్వు చాలావ‌ర‌కు అదుపు చేస్తుంది. కుంకుమపువ్వు ఉపయోగించడం వల్ల అధిక రక్తస్రావం లాంటి సమస్యలకు చెక్ పెట్ట‌వ‌చ్చు. అలాగే అంగస్తంభన తక్కువ ఉన్నవాళ్లు రోజు కుంకుమ పువ్వును ఉపయోగించడం మంచిదట‌. బాదం పాలలో కుంకుమపువ్వు కలిపి ఉపయోగిస్తే మగవారికి ఎన్నో రకాల ప్ర‌యేజ‌నాలు ఉన్నాయ‌ట‌.అంతేకాదు క్యాన్సర్ కారకాలైన వాటిపై ప్రిరాడికల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ కాకుండా ఉండేలా చేసే యాంటీ ఆక్సిడెంట్లు కుంకుమ పువ్వులో ఉంటాయి. ప్రతిరోజు కుంకుమపువ్వు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

కుంకుమ పువ్వు డైజెషన్ ప్రాబ్లం నిరోధిస్తుంది. కొద్దిగా తినగానే కడుపు నిండినట్లు అనిపించడం అలాగే దీనివల్ల బరువు తగ్గే ప్రయోజనాలు కూడా ఉంటాయి. రాత్రి నిద్రపోయే ముందు పాలల్లో కుంకుమపువ్వు కలుపుకుని తాగితే దీనిలో ఉండే మాంగనీస్‌ శరీరాన్ని ప్రశాంతతను కలిపించి త్వరగా నిద్ర పట్టేలా చేస్తుంది. కుంకుమపువ్వు లో క్రోసిన్‌ జ్వరాన్ని తగ్గించడంతోపాటు జ్ఞాపకశక్తిని కూడా పెంచడానికి సహకరిస్తుంది. అలాగే పాలలో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. కీళ్లనొప్పులు, ఆర్థసైటిస్‌ సమస్యలు తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.