మద్యం తాగి వాంతులు చేసుకునేవారికి భారీ షాక్… ఏకంగా రూ. 4 వేలు జరిమానా…!!

ప్రస్తుత రోజుల్లో యువత.. పెద్దవారని తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారు.” ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం ” అనీ.. అతిగా మందు తాగడం వల్ల వచ్చే వ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఎంత చెప్పినా తాగుబోతులు వినిపించుకోవడం లేదు. తాగాలనుకున్నవారు ఎక్కడికి వెళ్ళినా తాగుతారు.

కొన్నిసార్లు ఇంట్లో లేదా బార్ లేదా రెస్టారెంట్లో తాగుతారు. కొంతమంది పురుషులు మందు లిమిట్స్ లో సేమించినప్పటికీ.. మరి కొంతమంది బాబులు పీకలదాకా తాగి వామిట్ చేసుకుంటున్నారు. దీంతో బార్, రెస్టారెంట్లలోని వారికి క్లీనింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాస్త ఎక్కువ వాంతులు చేసుకుంటే జరిమానా విధిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి?

అయితే అతిగా మద్యం తాగి రెస్టారెంట్స్ లోని వాంతులు చేసుకునే వారు కోసం అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒక రెస్టారెంట్ ఒక స్పెషల్ రూల్ పెట్టింది. 50 డాలర్లు అంటే 4 వేల రూపాయల జరిమానా విధిస్తామని వెల్లడించింది. జనాలు లిమిట్స్ లో తాగాలని.. వాంతులు చేసుకోవద్దని రెస్టారెంట్ విజ్ఞప్తి చేసింది. అలాగే రెస్టారెంట్ ఆవరణంలో కస్టమర్లు చెత్త వేస్తే కూడా ఫైన్ వేస్తామని కఠినంగా ఆదేశాలు జారీ చేసింది.