వాల్‌న‌ట్ రోజు తీసుకుంటే శరీరానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?

డ్రై ఫ్రూట్స్ లో వాల్‌న‌ట్ కూడా ఒకటి. ఇది ఏ వయసులో వారికి అయినా చాలా మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇవి రోజు వారి ఆహారంలో తీసుకోవ‌టం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. వాల్‌న‌ట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాలు అన్నిటిని భర్తీ చేసి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. వాల్‌నట్స్ తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఇ, విటమిన్ బి 12, ప్రోటీన్, ఫోలెట్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాపర్, సెలోనియన్ ఇలా ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.

ఈ పోషకాలని శరీరాన్ని హెల్దిగా ఉంచి.. శరీరంలో పోషక లోపాన్ని తగ్గిస్తాయి. ఒక గుప్పెడు వాల్‌న‌ట్స్ రోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరం సున్నితంగా ఉండి కొన్ని ఆహార పదార్థాల పట్ల ఎలర్జీ కలిగి ఉంటే వారు ఈ వాల్‌నట్‌లు అలర్జీ అనిపిస్తే వాటిని తీసుకోకపోవడమే మంచిది. ఇక ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేసే కొన్ని వాల్నట్స్ను తీసుకోవడం వల్ల శరీరంలో లెక్కలేనని ప్రయోజనాలు ఉంటాయి.

మీరు బాదం లాగా వాల్‌న‌ట్‌ల‌ను కూడా రాత్రంతా నానబెట్టి తీసుకోవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పేగులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. చిన్న సిల్ల‌ల ఫుడ్ డైట్‌లో వీటిని ఇప్ప‌టినుంచే జ‌త చేర్చండి. దిని వ‌ల్ల శరీరానికి కావాల్సిన‌ పోషకాలు అన్ని స‌మ‌కూరుతాయి.