భావోద్వేగానికి గురైన హీరో సిద్ధార్థ్.. వీడియో వైరల్..?

ప్రముఖ హీరో సిద్ధార్థ్ తాజాగా భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు విషయంలోకెళితే చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమా చిన్నా కోసం ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన ఆయన స్టేజ్ పై మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు.. తమిళ నటుడైన సిద్ధార్థ పలు సూపర్ హిట్ తెలుగు సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాంటిది గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు ఇక్కడ ఆఫర్లు దాదాపు తగ్గిపోయాయని చెప్పాలి. చాలా రోజుల తర్వాత మహా సముద్రం అనే సినిమాలో అవకాశం వచ్చి.. నటిస్తే అది కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది.

అలా సరైన సక్సెస్ లేక అల్లాడుతున్న ఆయన తానే నటిస్తూ నిర్మించిన సినిమా చిట్టా.. గతవారం తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకొని ఐదు రోజుల్లోనే రూ.11 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇదే సినిమాను తెలుగులో చిన్నా అనే పేరుతో రిలీజ్ చేద్దామన్నప్పుడు సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని చెబుతూ.. ఆయన ఎమోషనల్ అయ్యారు. సిద్ధార్థ మాట్లాడుతూ..” ఇంతకంటే మంచి సినిమా నేను చూడలేదు అని ఉదయనిది స్టాలిన్ చెబుతూ తన సినిమాను కొన్నారని.. కేరళలో కూడా అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్స్ తన సినిమా తీసుకున్నారని .. కన్నడలో కూడా కేజీఎఫ్ నిర్మించిన వాళ్లు రిలీజ్ చేశారు అని.. కానీ తెలుగులోకి వచ్చేసరికి సిద్ధార్థ మూవీనా ఎవరు చూస్తారు? అని అన్నారు.

 

చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి మూవీ తీస్తే ప్రేక్షకులు చూస్తారని నా నమ్మకం.. అదే సమయంలో నా దగ్గరకు వచ్చి మేము మీతో ఉన్నామని ఏషియన్ సునీల్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. వాళ్లకు నా ధన్యవాదాలు. మీకు సినిమాపై నమ్మకం ఇష్టం ఉంటే థియేటర్ కు వెళ్లి చిన్నా సినిమా చూడండి.. ఇది చూసిన తర్వాత తెలుగులో సిద్ధార్థ్ సినిమాలు చూడం అనిపిస్తే ఇక తెలుగులో ప్రెస్ మీట్ పెట్టను.. ఇక్కడికి కూడా రాను” అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.