నయని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ గుట్టు బయటపెట్టిన అర్జున్ కల్యాణ్.. మరి ఇంత మోసమా…!!

బిగ్ బాస్ 7 నుంచి ఆరో వారం నయని పావని ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డుతో హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కేవలం ఒక వారంలోని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వాస్తవానికి మిగిలిన కంటెస్టెంట్ల కంటే ఆమె మెరుగ్గానే ఆటలో తన సత్తా చూపించినప్పటికే ఎలిమినేట్ అయ్యింది. దీంతో చాలామంది ప్రేక్షకులు నయ‌ని పావని ఎలిమినేషన్ ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు. ఆమెను హౌస్ నుంచి పంపించేయడం చాలా అన్యాయం అని పలువురు కామెంట్లు చేయగా.. యాంకర్ శివ కూడా ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ తెలిపాడు. తాజాగా బిగ్ బాస్ 6 కంటిస్టెంట్ అర్జున్ కళ్యాణ్ కూడా ఈమె ఎలిమినేషన్ ప్రక్రియను తప్పుపట్టాడు.

నయని పావని ఎలిమినేట్ కావడం పై అర్జున్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించాడు. ఈమె ని ఎలిమినేట్ చేయడం వల్ల బిగ్ బాస్ షో విలువను కోల్పోయింది అన్నాడు. ఆమె ఎలిమినేషన్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని.. అది తనను ఎంతగానో బాధించిందని తెలిపాడు. ఎంతో యాక్టివ్ గా ఉండే ఆమెకు ఇలా జరగడం కరెక్ట్ కాదని చెప్పాడు. దీంతో బిగ్ బాస్ క్రేడిబిలిటీ దెబ్బ తినడమే కాకుండా షో నిర్వాహకులకు భారీ నష్టమని పేర్కొన్నాడు. అంతే కాకుండా ప్రేక్షకులు వేసే ఓటింగ్లకు, కంటిస్టెంట్ల ఎలిమినేషన్ కు ఎలాంటి సంబంధం లేదని షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరాడు.

బిగ్‌బాస్ అన్ని సీజన్స్‌కి సంబంధించిన ఓటింగ్, ఎలిమినేషన్ వివరాలు ఇవ్వాలని ఎవరైనా కోర్టులో పిల్ దాఖలు చేయాలని అర్జున్ పేర్కొన్నాడు. దీంతో అర్జున్ కు పలువురు ప్రేక్షకులు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇలాంటి పిల్స్ తీసుకోవడానికి కోట్లు ఖాళీగా లేవని ఒకరు రాసుకొచ్చారు. దీంతో అర్జున్ ఇలా తిరిగి రిప్లై ఇచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని చాలామంది తెలుగువారు ఈ షో చూస్తున్నారు. అపై ఓట్లు కూడా వేస్తున్నారు. కానీ వారి ఓట్లకు విలువ లేకుండా ఇలాంటి నిర్ణయాల తీసుకోవడం వల్ల ప్రేక్షకులు కూడా నిరుత్సాహనికి గురౌతున్నారు. దీంతో కంటెస్టెంట్స్ కూడా నష్టపోతున్నారు. అర్జున్‌ ఇప్పుడు ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మరో ప్రేక్షకుడు ప్రశ్నించగా.

మీ ఎలిమినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని అర్జున్ ను తప్పు పట్టారు. దీంతో అర్జున్ మాట్లాడుతూ..” నేను ఎలిమినేషన్ సమయంలో బిగ్ బాస్ వారు ఇచ్చిన అగ్రిమెంట్ కాంట్రాక్ట్ లో ఉన్నాను. నేను ఎలిమినేషన్ అయినా తరువాత అసలు విషయం తెలిసింది. బిగ్ బాస్ 6 లో నేను ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు. ఇదే విషయం నాకు ఎంతో ఆలస్యంగా అర్ధమైంది. బిగ్ బాస్ అగ్రిమెంట్లో ఒక క్లాజ్ ఉంటుంది. హౌస్ లోని ఒక కంటెస్టెంట్ను ఎప్పుడెన్నా, ఎలాగైన్నా, ఎటువంటి కారణం చెప్పకుండా ఎలిమినేట్ చేసే అధికారం షో నిర్వహుకులకు ఉంటుంది “అని అర్జున్ తెలిపాడు. ఎలిమినేషన్స్ అనేవి ఓటింగ్ వల్ల మాత్రమే జరగవు. హౌస్ లో వాళ్లు ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తారు అనే విషయంపై కూడా జరుగుతాయి అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు.