దీనమైన స్థితిలో నటి పావలా శ్యామల..!

ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం ఇందులో ఉన్నంతవరకే ఎవరి జీవితాలు అయినా ఒక కొలిక్కి వస్తాయి..ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత వారి పరిస్థితి గోరంగానే తయారవుతుంది. అలా తయారైన వారిలో పావలా శ్యామల ఒకరు. ఈమె 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ సహా దాదాపు 250 సినిమాల్లో నటించింది. గోపిచంద్ నటించిన గోలీమార్ సినిమాలో పావలా శ్యామాల కామెడీ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు దీన పరిస్థితుల్లో ఉంది.

 

వివరాల్లోకి వెళితే ఆమెకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. తినేకి తిండి లేక ఆరోగ్యాన్ని సరిదిద్దుకోలేక తనను పోషించాల్సిన కూతురు మంచాన పడి చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయింది పావలా శ్యామల..అంతేకాకుండా ఆమెకు వచ్చిన అవార్డులను అమ్ముకొని పప్పులు బియ్యము లాంటివి తెచ్చుకుంటోంది.. అయితే ఈమె ఇబ్బందులను తెలిసినవారు కాస్త ఆర్థిక సహాయం చేశారు. కానీ ఆమె పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతోంది.

అంతేకాకుండా ఆమె ఫిర్జాదిగూడలోని ఒక వృద్ధాశ్రమంలో జన్మించింది.. అక్కడ కూడా డబ్బులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతొందని ఇలా కొన్ని విషయాలను ఆమె బయట పెట్టింది. అంతేకాకుండా ఇలానే మేము ఐదు రోజుల వరకు అన్నం తినకపోతే నా కూతురు నేను మంచమే పడి చస్తాము అని తెలుపుతోంది. పావలా శ్యామల మాకు ఆత్మహత్య చేసుకునే అంత ధైర్యం సరిపోలేదంటూ బాధపడింది. ఎవరైనా ఆమెకు డబ్బులు మందులు నిత్యవసరాలు పంపివ్వాలనుకుంటే ఆమె ఇంటికి పంపియండి. ఏదేమైనా అప్పట్లో పావలా శ్యామల పలు సినిమాలలో నటించి కడుపుబ్బ నవ్వించి ఇప్పుడు తన ఆర్థిక ఇబ్బందులతో శతమతమవుతోంది. ఆమెకి చాలామంది సహాయం చేశారు.. కానీ ఆమె ఆర్థిక ఇబ్బందులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి.