ఆవు పాలు, గేద పాలలో ఏది ఆరోగ్యానికి మంచిది.. నిపుణులు ఏం చెప్పారో తెలుసా….!!

సాధారణంగా ఆవు పాలు, గేద పాలు రెండు మనకి దొరుకుతుంటాయి. అయితే మనకి ఏది మంచిదో చాలా మందికి తెలియ‌దు. ఈరోజు మనం ఆవు పాలు, గేదె పాలు లో ఏది మంచిది అనేది తెలుసుకుందాం. పాలలో పోషక పదార్థాలు సమృద్దిగా ఉంటాయి. పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆవు పాలు, గేదె పాలు లో ఏది మంచిది అనేది చూస్తే.. గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకనే పాలు చిక్కగా ఉంటాయి.

అదే ఆవు పాలు తీసుకున్నట్లయితే కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆవు పాలలో నీళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. గేదె పాలలో నీళ్లు తక్కువగా ఉంటాయి. ఆవు పాలల్లో నీళ్లు ఎక్కువగా ఉంటాయి కనుక డిహైడ్రేషన్ సమస్య ఉండదు. అలానే ఆవు పాలల్లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. గేదె పాలల్లో చూసుకున్నట్లయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. గేదె పాలల్లో 10 నుంచి 11 శాతం ప్రోటీన్లు ఉంటాయి.

ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే గేదె పాలని ప్రిఫర్ చేయండి. అదే ప్రోటీన్స్ త‌క్కువగా కావాలనుకుంటే ఆవుపాలని తీసుకోండి. అదేవిధంగా ఆవు పాలల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. క్యాలరీలు విషయంలోకి వస్తే గేదె పాలలో కొవ్వు పదార్థాలు మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకని క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. గేదె పాలల్లో 237 క్యాలరీలు ఉంటే.. ఆవు పాలల్లో కేవలం 148 క్యాలరీలు ఉంటాయి.