రాజమౌళి మహాభారతంలో కీలక పాత్రలు చేసేది ఈ తెలుగు హీరోలే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అత‌డు చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలు అందుకోవడంతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ ద‌క్కించుకున్న రాజమౌళి సినిమాలో.. హీరోగా నటించేందుకు ఇప్పుడు ప్రతి హీరో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా రాజమౌళి సినిమాలో హీరోగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు నటులు. ఇక ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగానే రాజమౌళి డీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు.

 

ఇప్పుడు కూడా అదే విధంగా రాజమౌళి మహాభారతానికి సంబంధించి ఓ న్యేస్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఇండియన్ హీరోస్ అందరూ ఉంటారని అయినా కూడా మెయిన్ క్యారెక్టర్లలో ఎవరిని పెట్టాలనేది రాజమౌళి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడట. అందులో కీలకపాత్రలైనా శ్రీకృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు ఈ మూడు క్యారెక్టర్లకు కేవలం తెలుగు హీరోలని మాత్రమే కచ్చితంగా ఉంచాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణుడిగా ఎన్టీఆర్, క‌ర్ణుడిగా ప్ర‌బాస్, అర్జునుడిగా రామ్ చరణ్ ను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

 

మిగిలిన క్యారెక్టర్ కి ఇండియాలోని అన్ని భాషల్లో ఉన్న ఆర్టిస్టులు చేస్తారనే విషయం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది.. అనేది ఇంకా రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇక దీనికి సంబంధించిన పనులను బ్యాకెండ్లో రాజమౌళి చూసుకుంటున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం రాజమౌళి టార్గెట్ పాన్ ఇండియా లెవెల్ లో ఇండియా మూవీస్ ని ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలను గర్వంగా నిలబెట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మహాభారతం మూవీ మొదలవబోతుందట. ఏదేమైనా మహాభారతంలో ఉంటే కీలకపాత్రల కోసం తెలుగు హీరోలని తీసుకోవడం రాజమౌళి గ్రేట్నెస్ అని చెప్పాలి.