ఆస్కార్ బరిలో రెండు తెలుగు సినిమాలు.. విజయం ఏ సినిమాదో..?

ఆస్కార్ 2023 లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ అయినా ఆర్‌ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ అవార్డు అందిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుతో తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. తెలుగు సినిమాను తలెత్తుకునే విధంగా చేసింది. ఇక దీంతో ఈ ఏడాది ఏ తెలుగు సినిమా ఆస్కార్ బ‌రిలో ఉంటుంది అనే ఆసక్తి కోట్లాదిమంది ప్రేక్షకుల్లో నెలకొంది. 96వ అకాడమిక్ అవార్డ్‌(ఆస్కార్ – 2024) ది బెస్ట్ ఫారెన్ మూవీ విభాగం కోసం ఇప్పటికే పని ప్రారంభమైంది. ప్రముఖ ఫిలిం మేకర్స్ గిరీష్ కాసరపల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తులు చేసుకున్న సినిమాలను చూస్తుంది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అన్ని భాషల నుంచి 22 సినిమాలు వచ్చాయని సమాచారం. వాటిలో ది స్టోరీ టెల్లర్, మ్యూజిక్ స్కూల్, మిస్ చటర్జీ వర్సెస్ కుమార్, గాదర్ 2, అబ్ తో సార్ భగవాన్ భరోసా, రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని, జ్విగాటో, దీ కేరళ స్టోరీ ఇలా పలు బాలీవుడ్ సినిమాలు ఎంపికయ్యాయి. వీటితోపాటు వాలి మరాఠీ, తమిళ్ విడుద‌లై పార్ట్ 1 మూవీ అదే విధంగా తెలుగు సినిమాల నుంచి బలగం, దసరా సినిమాలు లిస్ట్ కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలను వీక్షించిన అనంతరం మన దేశం తరఫున ఒక సినిమాని ది బెస్ట్ ఫారెన్ మూవీ క్యాటగిరిలో ఆస్కార్‌కు పంపుతారు.

ఈ క్రమంలో మన తెలుగు నుంచి బలగం, దసరా సినిమాలు పోటీ పడుతున్నాయి రెండు సినిమాల బరిలో నుంచి ఆస్కార్కు ఏ సినిమా అడుగులు వేస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది ఇక ఈ ఏడాది మన దేశం నుంచి విడుదలై పార్ట్ 1, జ్విగాటో, బలగం సినిమాల నుంచి ఏదో ఒకటి ఆస్కార్ లిస్ట్‌కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీవర్గాల నుంచి టాక్. ఈ మూడు సినిమాలు ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులను అందుకున్నాయి. బాగా పాపులారిటీ దక్కించుకున్న వీటిలో బలగం సినిమాకు ఏకంగా వందకిపైగా నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. మరి వీటిలో ఏది ఆస్కార్ బరిలో నెగ్గుతుందో చూడాలి.