ప్రభుత్వంపై ఫైర్ అవుతున్న విజయ ఫ్యాన్స్ కార‌ణం ఇదే..

కోలీవుడ్ గవర్నమెంట్‌కి స్టార్ హీరోలకు మధ్య యుద్ధం ఎప్పుడు కామన్ గానే ఉంటుంది. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలకు కోలీవుడ్లో కొంతమంది స్టార్ హీరోలకు మధ్య పైకి కనిపించని వైరం నడుస్తుంది. ఇది కూడా అలాంటిదే స్టాలిన్ సర్కార్ పై విజయ్ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా. కొన్ని నెలలు కిందట కొత్త రూల్ ప్రవేశపెట్టింది తమిళనాడు గవర్నమెంట్.

ఇకపై వర్కింగ్ డేస్ లో సినిమాలు స్పెషల్ షోలకు అనుమతి లేదు. ఏ సినిమా అయినా ఉదయం 9 గంటల లోపు మొదలు పెట్టడానికి వీల్లేదు. నేషనల్ హాలిడేస్ లో మాత్రమే స్పెషల్ షోలకు అలుమతి ఇచ్చినట్లు పండగలు మినహాయిస్తే ప్రతిరోజు నాలుగు షోలు మాత్రమే ఉండాలని రూల్‌ని జారీ చేసింది. ఆ రూల్ అమల్లోకి వచ్చి చాలా రోజులైంది. దీనికి కారణం అజిత్ నటించిన తెగింపు సినిమా ఈ మూవీ షోను ఉదయం 4 గంటల నుంచి ప్రారంభించి వేసేవారు.

అలా ఎర్లీ మార్నింగ్ షోలో ఓ ప్రమాదం జరిగి ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో ఇలాంటి ఘటన మరోసారి రిపీట్ కాకుండా ఉండటం కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా వచ్చిన రజనీకాంత్ సినిమా జైల‌ర్‌ కూడా అదే రూల్ పాటించింది. తమిళనాడులో జైల‌ర్‌ సినిమాకు ఉదయం 5 గంటల షోలు పడలేదు. ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇవ్వలేదు. ఇక‌ విజయ సినిమాకు కూడా అనుమతులు వచ్చే అవకాశం లేదు.

దీంతో విజయ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక తమిళనాడు కంటే మిగతా ప్రాంతాలు అన్నిటిలో ఎర్లీ షోలు ఉన్నాయి. లోకేష్ కనకరాజు డైరెక్షన్లో లియో సినిమాలో నటించాడు విజయ్. ప్రస్తుతం విజ‌య్, లోకేష్ ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఉదయాన్నే చూసే వెసులుబాటు కోల్పోయారని తమిళ‌ ప్రేక్షకులు మరియు ముఖ్యంగా విజయ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.