సల్మాన్ ఖాన్‌కి జంట‌గా సమంత.. ఏ సినిమాలో అంటే..?

ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీలు అంద‌రు బాలీవుడ్ ఇండస్ట్రీని ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు తరచూ అవకాశాల్ని అందుకుంటున్నారు. ఇటీవల జవాన్ తో మెరిసింది నయనతార. రష్మిక అక్కడ అవకాశాన్ని సొంతం చేసుకుంటూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా సమంత కూడా బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ద‌క్కించుకుంది.

ఇక సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో సమంత నటిస్తుందని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విష్ణువర్ధన్ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అందులో దక్షిణాది కథానాయకనే తనకి జోడిగా నటించాలనేది సల్మాన్ ఖాన్ నిర్ణయం అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సమంతను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారట.

అందుకు ముందే త్రిష పేరు కూడా వినిపించింది. అయితే ఈ అవకాశం వీరిద్దరిలో ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇటీవల ఖుషి సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న సమంత.. స‌ల్మాన్‌శాన్‌ సినిమాతో అవకాశాన్ని దక్కించుకొని హిట్ కొడితే.. బాలీవుడ్ లో కూడా తిరుగులేని హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అని టాక్ వినిపిస్తుంది.