ఎవరికి లేని వింత సెంటిమెంట్లు మహేష్ కే ఎందుకు.. ఫ్యాన్స్ పరువు తీస్తున్నాడే..!

సూపర్​ స్టార్​ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు జిమ్​లో కుస్తీ పడుతున్నారు. ఆయన వరుసగా వర్కౌట్లు చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్​ చేస్తున్నారు. నలబైఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిగా ఫిట్​నెస్​ మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లి వచ్చిన మహేశ్​ ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్​ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు సెంటిమెంట్​కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్​లో చక్కర్లు కొడుతోంది.

చైల్డ్ ఆర్టిస్ట్​గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు . ఇప్పటివరకు దాదాపు 25 చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్స్​ను తన ఖాతాలో వేసుకున్న మహేష్ కి తన కెరీర్​లో కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయట. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. సాధారణంగా మహేశ్​ తన సినిమాల పూజా కార్యక్రమాలకు హజరవ్వరు . ఆయన నటించిన 25 సినిమా లో కనీసం ఒక్కసినిమా పూజా కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకాలేదట. ఈ సెంటిమెంట్​ను ఆయన తన తొలి సినిమా నుంచే అనుసరిస్తున్నారట.  అయితే మహేష్ కి బదులుగా ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్​ లేదా పిల్లలు గౌతమ్, సితార పూజా కార్యక్రమానికి హాజరవుతారట.

అయితే మహేష్ ఫాలో అవుతున్న ఈ సెంటిమెంట్‌కు కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలీదు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు అనే విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా లో మీనాక్షీ చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. గుంటూరు కారం సినిమా ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు మహేష్.