సూర్యతో వార్‌కి రెడీ అయిన విజయవర్మ..!!

బాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ వర్మ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. టాలీవుడ్ స్టార్ హీరో నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో ప్రతినాయకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విజయవర్మ. మీర్జాపూర్, దహాడ్‌, కాల్‌కూట్ లాంటి సిరీస్ లతో ప్రేక్షకులుకు మరింత చేరువయ్యాడు.

మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఇక తాజాగా ప్రముఖ హీరో సూర్య సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూర్య ప్రస్తుతం ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివా రూపొందిస్తున్న కాంగువ‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవగానే సూర్య కొంగర సుధా డైరెక్షన్లో మరో సినిమాలో నటించబోతున్నాడు.

ఇక ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాలేదు. అయితే ఈ సినిమాలో విజయవర్మ.. సూర్యకు ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఆకాశం నీ హద్దురా తర్వాత సూర్యతో సుధా చేస్తున్న ఆ సినిమాను 2d ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తోందట. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది.