29 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి 500 రోజులు ఆడిన మెగాస్టార్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే..!!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎటువంటి సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు చిరంజీవి. ఇక ఆయన నటించిన సినిమాలలో ” ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ” సినిమా రిలీజ్ ఇప్పటికే 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1982 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఆ తర్వాత ప్రేక్షకఆధ‌ర‌ణ పెరిగి సూపర్ హిట్గా నిలిచింది. ఏకంగా ‘ 512 ‘ రోజులు ఈ సినిమా నిరంతరాయంగా థియేటర్స్ లో ఆడింది.

అప్పటికే యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవి రాజశేఖర్ అనే హాస్య‌భ‌రిత‌ ఫ్యామిలీ క్యారెక్టర్ లో ఎంతోమంది ప్రేక్షకుల వ‌ద్ద‌ మంచి మార్కులు తెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో చిరంజీవి జంటగా మాధవి మరో కీలక పాత్రలో పూర్ణిమ నటించి మెప్పించారు. ఈ సినిమాతో రచయిత గొల్లపూడి మారుతీరావు నటుడిగా పరిచయమయ్యాడు. అమాయక స్త్రీలను మాటలతో లోబరుచుకునే జల్సా చేస్తే సుబ్బారావు పాత్రను గొల్లపూడి పోషించాడు. ఇక ఓ సినిమా షూటింగ్ అంటే ప్రస్తుత రోజుల్లో150 నుంచి 200 రోజులు తీసుకుంటున్నారు. అలాంటిది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా కేవలం 29 రోజుల్లో పూర్తి చేశారు.

ఇక ఈ సినిమా షూటింగ్‌కు రూ.3లక్షల రూ.20వేల బడ్జెట్ కాగా పాలకొల్లు, నరసాపురం, పోడూరు, సఖినేటిపల్లి, భీమవరం, మద్రాస్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. సినిమా పూర్తయిన తర్వాత సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాఘవ పట్టు వదలకుండా ఈ సినిమా కోసం పోరాడి బయటపడ్డారు. జీవి రాఘవులు స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు సి.నారాయణరెడ్డి పాటలు రాయగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి సుశీల పాడారు. ఈ సినిమాలో పాటలు అప్పట్లో ఎవర్గ్రీన్ సాంగ్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ సినిమాతో గట్టి పునాది వేసుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ ఆ తర్వాత మళ్లీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.