చంద్రబాబు అరెస్టుపై సంచలనం వ్యాఖ్యలు చేసిన సురేష్ బాబు..!!

తాజాగా గత రోజుల నుంచి 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టు పైన పలువురు టిడిపి కార్యకర్తలు స్పందించడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముకులు మాత్రం ఎవరు స్పందించలేదు.. దీంతో ఎల్లో మీడియా టిడిపి నేతలు సైతం అగ్రహాన్ని తెలియజేస్తున్నారు. సినిమా పరిశ్రమకు చంద్రబాబునాయుడు చాలా మేలు చేశారని వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి. అయితే తాజాగా నిర్మాత సురేష్ బాబు ఈ విషయం పైన ప్రశ్నించారు పలువురు రిపోర్టర్లు.

దీంతో ఆయన బదిలిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. సినిమా ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేశారు ఇండస్ట్రీ అంటే చంద్రబాబు నాయుడు అనేంతల స్థిరపడిపోయింది.. ఇలాంటి చంద్రబాబును అరెస్టు చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించగా.. ఇందుకు సురేష్ బాబు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు అనేక కాదు అందరూ సీఎంలు కూడా సినీ పరిశ్రమకు చాలా మేలు చేశారు.. ఎన్టీఆర్ కాలం నుంచి ఇది ఎక్కువగా కొనసాగుతోందంటూ తెలియజేయడం జరిగింది.

అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుంచి ఇక్కడికి తీసుకురావడంలో ఇండస్ట్రీకి కావలసిన సౌకర్యాలు కల్పించడంలో ఎన్టీఆర్ చాలా కృషి చేశారు.. ఆయన తర్వాత చెన్నారెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఇండస్ట్రీ చాలా బాగుపడిందని తెలిపారు..తన వరకు సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసిన వారిలో చెన్నారెడ్డి ఎన్టీఆర్లే ముందు వరుసలో ఉంటారని తెలిపారు. వారి వల్లే తెలుగు ఇండస్ట్రీ కూడా ఇక్కడి వరకు రాగలిగింది అంటూ తేల్చి చెప్పడం జరిగింది.