చిరంజీవి కోసం బాలీవుడ్ హీరోయిన్.. సెట్ అయ్యేనా..?

బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గతంలో తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె అందాన్ని పొగడని వారంటూ ఎవరు ఉండరు. అంతటి క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్యారాయ్. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అందంగానే ఉన్న ఐశ్వర్యరాయ్ మధ్యలో కూతురు పుట్టి కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఆ తర్వాత మళ్లీ స్లిమ్ గా తయారై సినిమాలలో చేయడం మొదలుపెట్టింది. రీసెంట్గా మణిరత్నం తెరకేక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలలో నటించింది.

Aishwarya Rai Bachchan roped in for Chiranjeevi's next? - India Today

ఇందులో నటించిన ప్రతి ఒక్క హీరోయిన్లు కూడా తమ అందంతో ఈ సినిమాకి మరింత వన్నె తెచ్చారని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యరాయ్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండే పాత్రలే వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగులో ఐశ్వర్యరాయ్ ను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు సంప్రదించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అది కూడా చిరంజీవి నటిస్తున్న 157 వ చిత్రానికి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాలో నటించబోతున్నారు. గత రెండు రోజులనుంచి హీరోయిన్ అనుష్క శెట్టి పేరు వినిపించగా కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది.

 

అయితే ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉందని ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. అందులో మరొక హీరోయిన్ ఐశ్వర్య రాయిని తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐశ్వర్య తెలుగులో నటించడానికి ఒప్పుకుంటుందో లేదో అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ని రంగంలోకి దింపేందుకు సిద్ధం కాబోతున్నారట.. చరణ్ అమితాబచ్చన్ కి మంచి స్నేహబంధం ఉండడంతో ఆయన ద్వారా వర్తిస్తే ఐశ్వర్య కచ్చితంగా ఈ సినిమాలో నటిస్తుందట. మరి ఇందులో ఎంత నిజమో తెలియాల్సి ఉన్నది.