తెలుగు బుల్లితెరపై అతిపెద్ద షో లలో అన్ స్టాపబుల్ షో కూడ ఒకటీ. ఈషో ఆహ లో ప్రసారం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ షో కి ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి బాలకృష్ణ హొస్టుగా ఈ షో కి వ్యవహరిస్తూ ఉన్నారు. ఓటిటి రంగంలోని ఒక సంచలనంగా మారిపోయింది అన్ స్టాపబుల్.. ఇప్పటివరకు రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఒకటి నుంచి మరొక సీజన్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ షో మూడో సీజన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ షోలో మూడో సీజన్లో గెస్ట్లుగా ఎవరు రాబోతున్నారు అంటూ ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. సెకండ్ సీజన్ లో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వకపోయినా ఫోన్ కాల్స్ ద్వారా ఆడియన్స్ ని బాగా అలరించారు. దీంతో మూడో సీజన్ లో కచ్చితంగా రామ్ చరణ్ ఎంట్రీ ఉండబోతుందని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మరో రెండు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.. బాలయ్య హొస్టుగా ఈ షో మొదలైన దగ్గర నుంచి చిరంజీవి ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
బాలయ్య చిరంజీవిని ఒకే స్టేజి పైన చూడడానికి ఆడియన్స్ అంతా మక్కువ చూపుతున్నారు. మూడో సీజన్ చిరంజీవితో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఆహా సంస్థల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం చిరంజీవి డేట్స్ కోసమే ఆహ చూస్తోందని కాల్ సీట్స్ అవ్వగానే సీజన్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. చిరంజీవితో పాటు కేటీఆర్ పేరు కూడా బాగానే వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.