నాగ్ కాల్ చేసి అడిగిన నో చెప్పిన రష్మిక.. నాగచైతన్య దరిద్రం పై అంత నమ్మకమా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నాసరే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న బ్యూటీస్ చుట్టే స్టార్ హీరోలు తిరుగుతూ ఉంటారు . అది మన అందరికీ తెలిసిందే . సాదాసీదా నార్మల్ హీరోయిన్స్ ని స్టార్ హీరోస్ తమ సినిమాలో పెట్టుకోరు.. ఎందుకంటే మార్కెట్ ఉండదు .. పబ్లిసిటీ రాదు వాళ్ళని హీరోయిన్స్ గా పెట్టిన సినిమా హిట్ అయ్యే స్కోప్ చాలా తక్కువగా ఉంటాయి.

అందుకే పేరు – పలుకుబడి – అందం – క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ని తమ సినిమాలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అలాగే నాగార్జున కూడా తన కొడుకు సినిమా కోసం ఏకంగా రష్మిక మందన్నా కు పర్సనల్గా కాల్ చేసి రిక్వెస్ట్ చేశారట . అయినా సరే అమ్మడు ఆఫర్ రిజెక్ట్ చేసింది . ఆ సినిమా మరేదో కాదు “బంగార్రాజు”.

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య – నాగార్జున కలిసి నటించారు. నాగచైతన్యకు జంటగా కృతి శెట్టి నటించింది. చఈ పాత్రలో ముందుగా రష్మిక మందన్నాను అనుకున్నారట మేకర్స్. కానీ ఆమె అప్పటికే వేరే సినిమాలో బిజీగా ఉండడంతో ఈ సినిమా రిజెక్ట్ చేసిందట . నాగార్జున కాల్ చేసి స్పెషల్గా అడిగినా సరే సారీ సార్ అంటూ సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. అయితే చాలామంది నాగచైతన్య పై ఉండే నమ్మకంతో రిజెక్ట్ చేసిందని ..ఆయనతో సినిమా నటిస్తే తన కెరియర్ కూడా ప్లాప్ అవుతుంది అన్న భయంతోనే ..ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసి ఉంటుందని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు..!!