హైదరాబాద్‌లో అద్దె గ‌ర్భాల‌ దందా.. ఆ కస్టమర్లే ఎక్కువట..!!

హైదరాబాద్‌లో అద్దె గర్భాల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. అనారోగ్య సమస్యలతో ఇక పిల్లలు పుట్టే అవకాశం ఏమాత్రం లేని మహిళలు చివరి దశలో సరోగసి విధానాన్ని ఆశ్రయించేవారు. అలాంటిది సరోగసిని అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎంతో అపురూపమైన అమ్మతనాన్ని లక్షలు పోసి అద్దె గర్భాలతో పొందుతున్నారు. సరోగసిని ఒక వ్యాపారం చేసేసారు. ఈ మార్గాన్ని ఎంచుకున్న వాళ్లలో జన్యున్గా వెళ్లేవారు సగం మంది మాత్రమే ఉన్నారట. హైదరాబాద్‌లో ఎప్పటినుంచో అక్రమంగా అద్దె గర్భాల వ్యాపారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరోసారి ఇదంతా వెలుగులోకి వచ్చింది. లక్షల్లో ఆశ చూపి పేద మహిళలను సరోగసి గర్భధారణకు ఒప్పిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారు. ఈ దందాలో కస్టమర్లుగా ఎక్కువగా ఎవరు వెళ్తున్నారు తెలిస్తే షాక్ అవుతారు. పిల్లలు పుట్టే అవకాశం లేని వాళ్ళు సగం మంది అయితే మిగతా సగం మంది మాత్రం పిల్లలు పుట్టే అవకాశం ఉన్న తమ అందం పాడవకూడదు అనే కారణంతో సరోగసి చేయిస్తున్నారు. ఇందులో ఎన్ఆర్ఐలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ ఏడాది మార్చ్‌లో హైదరాబాద్ నుంచి 21 సరోగసి దరఖాస్తులు వెళ్ళాయట.

వాటిలో 5 అక్రమమైన దరఖాస్తులను తేల్చారు. దీంతో ఆ 5 దరఖాస్తులు వివరాలను ఆరతియ‌గా అసలు విషయం బయటపడింది. ఆ ఐదుగురు మహిళలు అద్దె గర్భం దందా కోసమే వచ్చిన వారిగా అధికారులు గుర్తించారు. అద్దె గ‌ర్బం ధరించేందుకు తల్లులను ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌తో పాటు నేపాల్ లోని పేద మహిళలకు డబ్బు ఆశ చూపించి తీసుకొస్తున్నట్లు కనిపెట్టారు. వీళ్ళకు అద్దె గర్భాన్ని మోస్తున్నందుకు బాగానే ముట్ట చెబుతున్నారట. ఒక్క అద్దె గర్భం కోసం రూ4 నుంచి 5 లక్షల వరకు చెల్లిస్తున్నారని సమాచారం.