బిగ్ బాస్ 7: ఓటింగ్ లో రైతుబిడ్డ హ‌వా.. ఇంత‌కీ ఫ‌స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 రీసెంట్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టారు. మునుప‌టి సీజ‌న్స్ తో పోలిస్తే.. లేటెస్ట్ ఉల్టా పుల్టా సీజ‌న్ సూప‌ర్ ఎంట‌ర్టైనింగ్ గా కొన‌సాగుతోంది. మొద‌టి వారం నామినేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. ఫ‌స్ట్ వీక్ ఎనిమిది మంది ఎలిమినేష‌న్ కు నామినేట్ అయ్యారు.

ఈ జాబితాలో రతిక, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, దామిని, షకీల, కిరణ్ రాథోడ్ ఉన్నారు. సోమ‌వార‌మే నామినేష‌న్ ప్రక్రియ ప్రారంభం అయింది. సెప్టెంబర్ 5 రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు. హాట్‍స్టార్ యాప్ నుంచి మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్ విధానం పెట్టారు. అయితే ఈసారి ప‌ది ఓట్లు కాకుండా ఒక్క కంటెస్టెంట్‍కు ఒక్క ఓటు మాత్రమే వేసే విధానాన్ని తీసుకొచ్చారు.

అయితే ఓటింగ్ లో రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్ హ‌వా చూపిస్తున్నాడు. భారీ ఓటింగ్ తో టాప్ 1లో దూసుకుపోతున్నాడు. రతిక, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, దామిని, షకీల బాగానే ఓట్లు సంపాదించుకుంటున్నారు. లీస్ట్ ఓటింగ్ తో కిరణ్ రాథోడ్ ఉంద‌ని తెలుస్తోంది. ఆమెకు తెలుగు ఏమాత్రం రావ‌డం లేదు. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా ఆమెకు అర్థం అవ్వ‌ట్లేదు. దాంతో ప్రేక్ష‌కులు ఆమెకు ఏ మాత్రం క‌నెక్ట్ అవ్వ‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే కిర‌ణ్ ఓటింగ్ లో వెన‌క‌ప‌డిపోయింది. ఫ‌స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది కూడా కిర‌ణ్ రాథోడే అని బిగ్ బాస్ ప్రియులు బ‌లంగా చెబుతున్నారు.