సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజకుమారుడు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మహేష్ ఎన్నో బ్లాక్ బస్టర్ హాట్ సినిమా లో నటించాడు. ఆయన నటనతో తనకంటి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన 25 కంటే ఎక్కువ చిత్రాలలో కనిపించాడు. అంతేకాకుండా ఎనిమిది నంది అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ తెలుగు అవార్డులు , నాలుగు SIIMA అవార్డులు , మూడు సినిమా అవార్డులు, ఒక IIFA ఉత్సవం అవార్డుతో సహా అనేక ప్రశంసలను గెలుచుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలో మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్‌కు జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఒక నిర్మాణ సంస్థ కూడా ఉంది.
ఇక ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత కూడా ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమా లు తెరకేక్కాయి. ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ అనే సినిమా చిత్రికరించబడుతుంది. అలానే స్టార్ హీరోయిన్ సమంత గురించి చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఎంతో మంచి అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
గతంలో జరిగిన ఒక ఈవెంట్ లో మహేష్ బాబు, త్రివిక్రమ్ లను సమంత ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో మహేష్ ని కొన్ని ఆసక్తికర విషయాలను అడిగింది సామ్. సామ్ అడిగిన ప్రశ్నలకు మహేష్ కాస్త ఘాటుగానే సమాధానం చెప్పాడు అని చెప్పాలి. అసలు సమంత, మహేష్ బాబుని ఏం అడిగింది అనేదాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమంత మాట్లాడుతూ ‘ మీ షర్ట్ వెనుక ఉన్న సిక్స్ ప్యాక్ బాడీని ఎప్పుడు చూపిస్తారు. ఆ అదృష్టాన్ని మాకు ఎప్పుడు కలిగిస్తారు ‘ అని అడుగుతుంది. దాంతో మహేష్ వెంటనే ‘ చూపించను. నా బాడీని ఎవరూ చూడరు.’ అంటూ సమాధానం చెప్తాడు. దాంతో సామ్ ‘ఏంటి మహేష్ గారు ఇంత డిస్సపాయింట్ చేసారు. త్రివిక్రమ్ గారు కనీసం మీరయినా మహేష్ సిక్స్ ప్యాక్ బాడీని ప్రేక్షకులకు చూపించడానికి ప్రయత్నించండి’ అంటూ త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేస్తుంది సామ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.