మళ్లీ రతిక ఎక్స్ గురించి రచ్చ….. రతికాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన శుభశ్రీ…..!!

బిగ్బాస్ తెలుగు 7 సీజన్.. 14 మందితో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేషన్ తో ప్రస్తుతం 11 మందే మిగిలారు. అదిగో వైల్డ్ కార్డ్ ఎంట్రీ… ఇదిగో వైల్డ్ కార్డు ఎంట్రీ.. అంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇంతవరకు దాని జాడే లేదు. ఈసారి సీజన్ ఉల్టా పుల్టా అన్నారు కాబట్టి మరో రెండు వారాల తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండే అవకాశం ఉంది. ఇకపోతే మండే అంటే బిగ్ బాస్ ఇంట్లో కంటిస్టెంట్లు మధ్య మంట పెట్టే రోజు.

మరోవైపు బిగ్ బాస్ కొత్త తరహా నామినేషన్ ప్రవేశపెట్టింది. పవర్ అస్త్ర గర్ల్స్ ప్రమోషన్ పొందిన శోభ, శివాజీ, సందీప్ లను జ్యూరీ సభ్యులుగా నియమించాడు. ఇతర కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిని బోన్ లో నిలబెట్టి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. వారి కారణాలు ఆ జడ్జిలకు సమ్మతంగా అనిపిస్తే అవతలవారు నామినేట్ అవుతారు. ముందుగా ప్రిన్స్ యావర్ నామినేషన్స్ మొదలు పెట్టాడు… ఇద్దరమ్మాయిలు నన్ను ఆటలో నుంచి తప్పించారు అందుకే నేను ప్రియాంక ని నామినేట్ చేస్తున్నానని ప్రియాంకని నామినేట్ చేశాడు. కానీ ఇందుకు జడ్జి శోభ ఒప్పుకోలేదు.

ఇద్దరమ్మాయిలు ఉన్నారు కాబట్టి త్యాగం చేస్తానని నువ్వు తేజతో అన్నావా? లేదా? అని నిలదీసింది. దీనికి ప్రిన్స్… అది వేరే విషయమని.. అందరి ముందు చెప్పిన దాని గురించి తను మాట్లాడుతున్నానని వాదించాడు. తర్వాత తేజను సైతం నామినేట్ చేశాడు. అటు శుభశ్రీ సైతం కరెక్ట్ పాయింట్లు మాట్లాడింది. ఈ హౌస్ లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడకూడదన్న రూల్ ఉందని, దాన్ని రతిక అతిక్రమించిందని పేర్కొంది. ఇక్కడ లేని వ్యక్తి, ఒక సెలబ్రిటీ గురించి పదే పదే మాట్లాడటం తప్పని నామినేట్ చేసింది. మొత్తానికి ఈ వారం గౌతమ్, ప్రిన్స్, శుభశ్రీ, టేస్టీ తేజ, రతిక, ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది.