అన్నగారితో రెండేళ్లు మాట్లాడని హరికృష్ణ.. కారణం ఇదే..!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు ఈ పేరు చెప్తే తెలుగునాఢ‌ గర్వపడుతుంది.. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ చేయని పాత్ర అంటూ లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ పొజిషన్ కి వచ్చిందంటే దాంట్లో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర ఛౄళౄ ఉంది. అలాంటి ఆయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా చరిత్రలు సృష్టించాడు. తెలుగు రాష్ట్రానికి సీఎంగా చేసి పేద ప్రజల కోసం ప్రత్యేకమైనటువంటి ఎన్నో పథకాలను తీసుకువచ్చిన గొప్ప మహనీయుడు.

అలాంటి ఎన్టీఆర్ నట వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగిన.. హరికృష్ణ మీడియం లెవెల్‌ హీరోగా నిలిచిపోయాడు. ఎన్టీఆర్ కొడుకులందరిలో హరికృష్ణ అంటే అన్నగారికి ఎంతో ఇష్టం. మరియు నమ్మకం అట. అందుకే తన రాజకీయానికి సంబంధించిన అన్ని పనులు హరికృష్ణ చూసుకునేవాడట. అంతేకాకుండా హరికృష్ణ కి కోపం కూడా ఎక్కువగా ఉండేదట. ఒకానొక టైంలో హరికృష్ణ తన తండ్రిని ఒక కోరిక కోరాడట. నాన్న నేను ఒకధియేటర్ కట్టాలి అనుకుంటున్నాను ఏమంటారు అని అడగాడ‌ట‌.

ఎన్టీఆర్ తన ప్రాణ స్నేహితుడైన నాగేశ్వరరావు సలహా తీసుకున్నాడట. నా కొడుకు థియేటర్ కట్టాలి అంటున్నాడు. అది కడితే బాగుంటుందని అడిగాడట. దీంతో నాగేశ్వరరావు థియేటర్ కంటే స్టూడియో కడితే బెటర్ అని సలహా ఇచ్చాడట. వెంటనే స్టూడియో పనులు స్టార్ట్ చేశాడట ఎన్టీఆర్. హరికృష్ణ థియేటర్ కట్టాలని అంటే పట్టించుకోని తండ్రి స్టూడియో కట్టడానికి సన్నాహాలు మొదలు పెట్టడంతో హరికృష్ణ తండ్రితో రెండు సంవత్సరాల పాటు కోపంగా మాట్లాడడం మానేశాడట‌. ఆ తర్వాత థియేటర్ స్థానంలో స్టూడియో కట్టారని తెలుసుకున్న హరికృష్ణ తన తండ్రితో మళ్ళీ మాట్లాడాడని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.