నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి.. బన్నీ ట్విట్ కి రిప్లై ఇచ్చిన షారుక్‌..!

షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తాజాగా రూపొందిన మూవీ జవాన్. సెప్టెంబర్ 7న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వ‌శుళ‌ను కొల్లగొట్టిన ఈ మూవీకి ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. దీంతో చాలామంది హీరోలు అభినందనలు తెలియజేశారు. ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

జవాన్ బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నందుకు ముందుగా టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు అల్లు అర్జున్. మూవీలోని నటీనటులు, టెక్నీషియన్స్, సిబ్బంది, ప్రొడ్యూసర్స్ అందరికీ అభినందనలు. షారుక్ మాస్ అవతార్ ఇది. తన స్వాగ్‌తో ఇండియాను ప్రపంచం మొత్తాన్ని అట్రాక్ట్ చేశాడు అంటూ రాసుకొచ్చాడు. చాలా సంతోషంగా ఉంది సార్ అంటూ తెలియజేశాడు. దీంతో తాజాగా షారుక్ ఖ్ఖాన్ కూడా బన్నీ ట్విట్ కు రిప్లై ఇచ్చాడు. ఆ విషయానికి వస్తే ఫైర్ నన్ను పొగుడుతుంది వావ్ చాలా సంతోషంగా ఉంది మీ ట్విట్ తో జవాన్ సక్సెస్ మరింత ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది అని వివ‌రించాడు.

నేను పుష్ప మూవీ మూడు రోజుల్లో మూడుసార్లు చూశాను. నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి నా నుంచి నీకు పెద్ద హగ్ టైం దొరికినప్పుడు నేరుగా వచ్చి కౌగిలించుకుంటా కీప్ స్వాగ్ంగ్ లవ్ యు అని షారుక్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరు ఇద్దరు చేసుకుంటున్న ట్విట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.