“వాన” మూవీ హీరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..? అస్సలు ఊహించలేరు..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం .. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు .. కచ్చితంగా ఇది జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయడం.. మనం ఊహించినవి ఎక్స్పెక్ట్ చేయనిదే జరుగుతూ ఉంటాయి. అదే ఫిలిమ్ ఇండస్ట్రీ అంటే . కాగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంట్ ఉన్న కుర్రాళ్ళు హీరోలుగా ఎంట్రీ ఇచ్చే స్టార్స్ గా మారాలనుకున్నారు . అయితే చాలామంది ఒకటి రెండు సినిమాలకు డిజాస్టర్ గా మారిపోయారు. ఆ కోవాలోకే వస్తాడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న వాన మూవీ సినిమాలోని హీరో వినయ్ రాయ్.

ఈ హీరో నటించిన వాన సినిమా కూల్ అండ్ క్లాసిక్ హిట్ గా టాక్ సంపాదించుకుంది . కమర్షియల్ గా పెద్దగా హిట్ కాకపోయినా లవర్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది . ఈ సినిమా తర్వాత రెండు సినిమాల్లో నిలిచిన వినయ్ రాయ్.. ఆ తర్వాత ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు . ఇంగ్లీష్ సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకున్నాడు . ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ చెప్పి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలో పోషించడం స్టార్ట్ చేశాడు.

2017లో విశాల్ నటించిన డిటెక్టివ్ సినిమా ద్వారా విలన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వినయ్ .. ఆ తర్వాత తెలుగులో కూడా సినిమాల్లో విలన్ గా మెప్పించాడు . ఆ తర్వాత తెలుగులో గాండీవ దారి అర్జున సినిమాతో మళ్ళీ విలన్ గా కొత్త అవతారం ఎత్తాడు . ప్రెసెంట్ ఈయన హిందీ – తెలుగు భాషలలో విలన్ గా పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు . అంతేకాదు స్టార్ హీరో లుక్స్ ఉన్న ఈ హీరో విలన్ గా నటించడం ఏంటి అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. అంతేకాదు త్వరలోనే సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న హనుమాన్ సినిమాలో సైతం ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు . దీంతో వినయ్ రాయ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!