బాలయ్య – మహేష్ బాబును నేను అలా కలవలే, సీరియల్ యాక్టర్ మానస్ కామెంట్స్ వైరల్..!

అడప దడప సీరియల్ లో హీరోగా నటించిన మానస్.. తెలుగు బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన మాన‌స్‌ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బీటెక్ చదువుతున్న రోజుల్లో డైరెక్టర్ మారుతి నాకు ఓ సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చాడని కథ మొత్తం వివరించాడు.. కానీ నాకు అప్పుడు అంతగా 5D పై ఐడియా లేకపోవడంతో వద్దులేండి అని చెప్పేసా అంటూ చెప్పుకొచ్చాడు.

 

ఈ సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ అయింది అంతేకాదు టాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్ఖ్ కూడా క్రియేట్ చేసింది అంటూ వివరించాడు. తర్వాత నేను అనవసరంగా ఆ మూవీ మిస్ చేసుకున్నానని చాలా బాధపడ్డాను. పైగా ఆ టైంలో నన్ను గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరూ లేకపోయారు. ఈ కారణంతోనే నేను ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాను. కానీ తర్వాత దర్శకుడు మారుతి మళ్లీ పిలిచి ఆయన బ్యానర్ లోనే రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్ లో నటించాను అలాగే రొమాంటిక్ ప్రేమ కథ సినిమాలో కూడా హీరోగా ఫస్ట్ నాకే అవకాశం వచ్చింది అంటు వివ‌రించాడు.

 

ఈ సినిమా కూడా 5Dలో షూట్ చేస్తున్నాం గేరెల్లా స్టైల్ లో ఉంటుందని చెప్పడంతో నాకేం అర్థం కాలేదు. అర్జున్ చిత్రంలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించాను.. కానీ ఇప్పటివరకు నేను మహేష్ బాబు, బాలకృష్ణను సపరేట్‌గా వెళ్లి మీట్ అవ్వడం జరగలేదు అంటు చెప్పుకొచ్చాడు. అలాగే నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా నాకు సహాయం చేయండి.. నన్ను ప్రమోట్ చేయండి.. అంటూ ఎవరిని హెల్ప్ అడగలేదు అని వివరించాడు మానస్. ప్రస్తుతం మానస్‌ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.