టాలీవుడ్ లో శృంగార తారగా పెరు పొందిన నటి సిల్క్ స్మిత.. అంతే గుర్తింపు సంపాదించుకున్న మరొక నటి షకీలా ఇద్దరు కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. సిల్క్ స్మిత ఎంతగానో సంపాదించినప్పటికీ చివరికి ఆమె మరణించే సమయానికి మోసపోయి అర్ధాంతరంగా సూసైడ్ చేసుకొని మరణించింది. షకీలా కూడా తన సినిమాలతో బాగానే సంపాదించిన తన సొంత కుటుంబ సభ్యుల చేతిలో మోసపోయింది ఇలా వీరిద్దరి జీవితాలు కూడా దాదాపుగా ఒకే కోవకు చెందిన వాటి లాగా కనిపిస్తూ ఉన్నాయి.
ఇటీవల షకీలా బిగ్ బాస్ -7 లో అడుగు పెట్టింది హౌస్ లో షకీలా ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి ఈమె గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో షకీలాని అందరూ చూస్తుండగానే సిల్క్ స్మిత కొట్టి అవమానించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయానికి వస్తే సిల్క్ స్మిత షకీలా ఇండస్ట్రీకి రాకముందే స్టార్ గా ఎన్నో సినిమాలలో నటించింది.. షకీలా మాత్రం ప్లే గర్ల్స్ అనే చిత్రంతో తమిళ ఇండస్ట్రీ ద్వారా మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో షకీలాతో పాటు సిల్క్ స్మిత కూడా నటించిందట.
అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత సిల్క్ స్మిత కంటే మంచి పాపులారిటీ షకీలాకే లభించిందట.. అలా ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు రావడంతో పాటు ఏమి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే స్టార్ హీరోలు చిత్రాలు కూడా రిలీజ్ చేసేవారు. అయితే అలాంటి షకీలాని సిల్క్ స్మిత ప్లే గర్ల్స్ అనే సినిమా చేసే సమయంలో కొట్టిందట.. సిల్క్ స్మిత అప్పటికే మద్యానికి బానిసయ్యిందట. షూటింగ్ సమయంలో తాగి వచ్చి.. ఎక్కువ టేక్స్ తీసుకోవడంతో షకీలా ఇలా చేస్తే బాగుంటుందని సిల్క్ స్మితతో చెప్పిందట దాంతో ఫైర్ అయిన సిల్క్ స్మిత నువ్వు ఏంటి నాకు చెప్పేది అంటూ చేయి చేసుకుని అవమానించిందని సమాచారం. దీంతో అవమానంగా ఫీలైన షకీలా వెంటనే ఇంటికి వెళ్లిపోయిందట.