ఆఫ‌ర్ల కోసం రోజురోజుకు వాటి సైజ్ త‌గ్గించేస్తున్న న‌భా న‌టేష్‌.. చూసి త‌ట్టుకోలేక‌పోతున్న ఫ్యాన్స్‌!

నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన న‌భా.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. వజ్రకాయ అనే కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో ఈ బ్యూటీ కి మొదటి సినిమా `నన్ను దోచుకుందువటే`. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా నటేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆఫర్లు కూడా క్యూ కట్టాయి.

అలా డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, మాస్ట్రో, అల్లుడు అదుర్స్.. ఇలా వరుసగా సినిమాలు చేసింది. కానీ ఇవి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. దీంతో న‌భా న‌టేష్ పై ఐర‌న్ లెగ్ అనే ముద్ర ప‌డింది. అలాగే కొత్త హీరోయిన్ల పోటీ కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతో.. క‌నీసం యంగ్ హీరోలు కూడా న‌భా న‌టేష్ ను ప‌ట్టించుకోవ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలోనే న‌భా న‌టేస్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది.

రోజురోజుకు దుస్తుల సైజు తగ్గించేస్తూ.. గ్లామ‌ర‌స్ ఫోటోషూట్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా మ‌రోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్లాక్ క‌ల‌ర్ ట్రెండీ డ్రెస్ ధ‌రించి.. నెవర్ బిఫోర్ లుక్ లో అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు క‌వ్వించింది. ఫ్లోర్ పై సిట్టింగ్ స్టిల్స్ తో మెంట‌లెక్కించింది. న‌భా న‌టేష్ లేటెస్ట్ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆమె అందాలు చూసి నెటిజ‌న్లే కాదు ఫ్యాన్స్ సైతం త‌ట్టుకోలేక‌పోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)