పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున అలాంటి త్యాగం చేశాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో, సేవాభావంతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. ఇక‌ మన్మధుడు నాగార్జున కూడా అందరికీ తెలుసు ఈయన కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వయసు 60 ఏళ్లు దాటిన ఇంకా అదే యంగ్ లుక్ లో కొడుకులతో పోటీగా సినిమాల్లో నటిస్తున్నాడు.

అయితే ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున పెద్ద త్యాగం చేశాడు అంటూ న్యూస్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ త్యాగం ఏంటి.. ఏం చేశాడు.. ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. అయితే తమ్ముడు సినిమా అనుకున్న టైంలో ఈ సినిమాకు టైటిల్ ని పవన్ కళ్యాణ్ పెట్టక ముందే నాగార్జున మూవీ కోసం ఈ టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నాడట.

పవన్ కళ్యాణ్ సినిమా కోసం దర్శకుడు ఈ టైటిల్ ని అనుకోవడం దీని గురించి పవన్ కళ్యాణ్ నాగార్జున తో చెప్పడంతో.. నాగార్జున ఆ టైటిల్ నువ్వు వదులుకున్నాడు. నాగార్జునకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మా సినిమాకి తమ్ముడు టైటిల్ బాగుంటుంది. మా కోసం వదులుకోరా అని రిక్వెస్ట్ చేస్తే నాగార్జున అ టైటిల్ ని వదిలేసాడట. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం నాగార్జున తన టైటిల్ త్యాగం చేశాడు.