జవాన్ ఆ స్పెషల్ డే రోజున ఓటిటి స్ట్రీమింగ్..!!

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్..ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా విడుదలై ఇప్పటికే 797 కోట్ల రూపాయల కలెక్షన్స్ను అందుకోవడం జరిగింది. హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం వంటి భాషలలో ఈ సినిమా విడుదల కలెక్షన్ పరంగా భారీగానే వసూలు సాధించింది. ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్గా విజయ్ సేతుపతి విలన్ గా దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.

Shah Rukh Khan starrer 'Jawaan' to release on OTT soon…,jawan-ott -version-director-atlee-reveals-jawan-release

అయితే జవాన్ సినిమా ఓటీటి లో విడుదల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ విషయం పైన డైరెక్టర్ స్పందిస్తూ షారుక్ ఖాన్ ఫ్యాన్సీ కు మరొక గుడ్ న్యూస్ అందించారు..సరైన రన్ టైం ఎమోషనల్ సీన్స్ తో జవాన్ సినిమాను థియేటర్లో విడుదల చేశాము అయితే ఓటీటి లో విడుదల చేసి సమయానికి మరికొన్ని సన్నివేశాలు కూడా యాడ్ చేయబోతున్నామంటూ తెలియజేశారు. అందుకే హాలిడేకు వెళ్లకుండా ఇప్పుడు దీనిపైన వర్క్ చేస్తున్నామంటూ కూడా తెలియజేశారు. ఓటిటి జవాన్ సినిమా కచ్చితంగా అందరిని సర్ప్రైజ్ చేస్తుందని కూడా తెలిపారు డైరెక్టర్ అట్లే.

ఓటిటి హక్కులను సైతం నెట్ ఫిక్స్ సుమారుగా రూ .250 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్ మొదటి వారంలో స్ట్రిమింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుక కూడా ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే ఈ విషయం పైన అధికారికంగా ఓటీటి సంస్థ తెలియజేస్తుందేమో చూడాలి మరి.