పవన్ చేతికి ఉన్న ఉంగరాలను గమనించారా.. వాటి వెనుక రహస్యం ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా మొదటి రోజు ఫస్ట్ షో రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు ఇటీవల రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి బిజీ బిజీగా షెడ్యూల్ గడుపుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తన చేతికి ఎప్పుడు 2 ఉంగరాలు ఉంటూనే ఉంటాయి.

అయితే ఈ రెండు ఉంగరాల వెనుక ఓ సెంటిమెంట్ కూడా ఉందంటూ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పెట్టుకుంటున్న ఆ రెండు ఉంగరాలను కొంతమంది జ్యోతిష్యులు తరిస్తే మంచిదని చెప్పారట. అందుకని ఆ నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఆ ఉంగరాలను పెట్టుకునే ఉంటాడ‌ట. ఆయన చేతికి తాబేలు ఉంగరం తో పాటుగా నాగపాము ఆకారంలో ఒక ఉంగరం ఉంటుంది. ఆ రెండు ఉంగరాలను పెట్టుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ కు కలిసి వస్తుందని నమ్ముతాడట.

మంగళవారం, శనివారం పూట పవన్ కళ్యాణ్ పగడం ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంటూ ఉంటాడట. తాబేలు ఉంగరం పెట్టుకుంటే ధన, అధికారిక యోగం ఉంటుందట‌. నాగపాము ఉంగరం వలన అపమృత్య‌ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. గండాల నుంచి ఈ ఉంగరం కాపాడుతుంద‌ట‌. దుష్టశక్తులు మనపై పడకుండా చేస్తుందట‌. అందుకే పవన్ కళ్యాణ్ ఈ ఉంగరాన్ని పెట్టుకుంటాడని తెలుస్తుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.