అద్దె గర్భంతో పిల్లలను కన్నా స్టార్ నటి నటులు వీళ్లే..!

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు సరోగసి విధానాన్ని ఉపయోగించి తమ పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కొంత‌మంది వారే స్వయంగా వెల్లడించారు. అయితే అలా సరోగసి విధానం ద్వారా పిల్లలను కన్నా సెలబ్రిటీలు ఎవరో ఒకసారి చూద్దాం.

ప్రియాంక చోప్రా :


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రియుడు నిక్ జోన‌స్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్ళిద్దరూ ఇటీవల పేరెంట్స్‌గా మారారు. అసలు ప్రియాంక ప్రెగ్నెంట్ కాలేదు. మరి ఎలా తలైంది అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే నిజానికి ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌తో కలిసి సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు స్వయంగా ప్రియాంకనే వెల్లడించింది.

సన్నీ లియోన్ :


శృంగార తార సన్నిలియోన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కూడా సరోగసి ద్వారా ఇద్దరు కావల పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాకుండా మరో బిడ్డను సన్నిలియోన్ దత్తత తీసుకుంది. ఇక ప్రస్తుతం సనిలియోన్‌ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో సినిమాల్లో నటిస్తుంది.

అమీర్ ఖాన్:


బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావు కూడా అద్దె గర్భం ద్వారానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కిరణ్ రావుకు 36 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె సరోగసి విధానాన్ని చూజ్‌ చేసుకుంది. దీని ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది.

షారుక్ ఖాన్ :


బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ఖాన్ గౌరీ ఖాన్‌లు కూడా మూడో బిడ్డను సరోగసి ద్వారానే కన్నారు. గౌరీ 40 ఏళ్ళ వయసులో బిడ్డకు జన్మనివ్వడం క్షేమం కాదని భావించే అద్దె గర్భం ద్వారా మగ బిడ్డ అక్బర్ కి జన్మనిచ్చింది.

మంచు లక్ష్మి :


బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను సరోగసి విధానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చే అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించింది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి దంపతులు తమ బిడ్డ విద్యానిర్వణ‌కు సరోగ‌సి ద్వారా జన్మనిచ్చింది. గుజరాత్ కు చెందిన ఓ మహిళ ద్వారా మంచు లక్ష్మి బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం.

కరణ్ జోహార్ :


కరణ్ జోహార్ ఎవరిని వివాహం చేసుకోకుండానే సరోగసి ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాడు. పిల్లల ఆలనా పాలన తన తల్లి సాయంతో కరణ్ జోహార్ చూసుకుంటున్నాడు.

నయనతార – విగ్నేష్ శివన్ :


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. స‌రోగ‌సి విధానంలోనే ఈ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు సమాచారం.