ఈ ఫోటోలో చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలను చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతారు. వారి చిన్నప్పటి ఫోటోలు చూసి ఓ చిన్నప్పుడు ఆమె ఎలా ఉండేదా ఆ హీరో ఇలా ఉండేవారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఫోటోలు ఎప్పటికప్పుడు త్రో బ్యాక్ థీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయక లో ఈమె ఒకటి. అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. ప్ర‌స్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఇటీవల పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయ్యి తల్లిగా కూడా ప్రమోషన్ పొందింది. ఇప్పటికైనా గుర్తుపట్టారా..? ఎస్ ఆమె టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా.

నాజుకు నడుముతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తరువాత ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ట్‌డం సంపాదించుకుంది. ఇక 2012లో బార్బీ సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సక్సెస్ తో బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ కొన్ని కారణాలతో సినిమాలకు దూరమైంది. ఇక పెళ్లి కాకపోయినా తల్లిగా ప్రమోట్ అయి గ‌త కొంత కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.