మీ కోరికలు నెరవేరాలంటే.. వినాయక చవితి రోజున ఇలా చేయండి..!!

మన దేశంలో ఏదైనా పండుగ వస్తోందంటే చాలు ఎక్కువగా గణపతిని పూజిస్తూ ఉంటారు.. ఎందుకంటే వినాయకుడు ఆశీస్సులు ఉంటే చాలు ఏ పనైనా సరే విజయంగా సాగుతుందని నమ్మకాన్ని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అయితే ఏడాది వినాయక చవితి 19వ తారీఖు జరుపుకోవాలని కొంతమంది 18 వ తారీకు జరుపుకోవాలని చాలా రకాల తేదీలతో కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే సెప్టెంబర్ నుంచి భద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగో రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు.

Happy Ganesh Chaturthi 2023 - Beautiful Wishes and Messages

వినాయక చవితి రోజున పనులు కొన్ని చేసినట్లు అయితే వినాయకుడు అనుగ్రహంతో తమ కోరికలు వెంటనే నెరవేరుతాయి అని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. వినాయక చవితి పండుగ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఆ తర్వాత బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పించిన తర్వాత దానిని ఆవుకు తినిపించడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి డబ్బులు ఎలాంటి ఇబ్బందులు ఉండవట.

బెల్లంతో చేసిన 21 చిన్న ఉండలను ఉంచడం మంచిది. వినాయక చవితి రోజున దూర్వ గడ్డితో పూజ చేస్తే చాలా మంచిది. దూర్వ గడ్డిని పసుపు ముద్దలు తీసుకొని పసుపు రంగులో ఉండే వస్త్రంలో కట్టి వీటిని వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు దీనిని పూజించాలి ఆ తర్వాత ఆ వస్త్రాన్ని ఏదైనా సురక్షితమైన ప్రాంతంలో ఉంచడం వల్ల ఆ ఇంటికి అన్ని శుభశకునాలే జరుగుతాయట.

చవితి రోజున మీ ఇంటి గుడిలో గణేష్ యంత్రాన్ని ప్రతిష్టించడం వల్ల ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుంది. వీటితోపాటు గణపతికి క్రమం తప్పకుండా అభిషేకం చేయడం వల్ల ప్రత్యేకమైన ఫలాలను పొందుతారు. వీటితోపాటు గణపతి ఆశీర్వాదం కూడా లభిస్తుంది.