భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ పెద్ద బోల్తాపడిన మల్టీ స్టార్ సినిమాలు ఇవే..!

టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టార‌ర్ మూవీ వస్తుంది అంటే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి ఓ రేంజ్ లో ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు కాంబినేషన్లో మల్టీ స్టార‌ర్ సినిమాలు రూపొంది మంచి సక్సస్ అందుకున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఫ్లాప్స్ గా కూడా నిలిచాయి. ఈ కోవలోనే భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్ మూవీలుగా రూపొంది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సినిమాలేవో ఓ లుక్కేద్దాం రండి.

ఆచార్య :


మెగాస్టార్ చిరంజీవి , కొడుకు రామ్ చరణ్ కలిసి న‌టించిన మల్టీస్టారర్ మూవీ ఆచార్య. ఈ సినిమాకు రామ్‌చరణ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. ఇక ఇద్దరు పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ హీరోస్ మల్టీస్టారర్ గా రూపొంది డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఇదే.

శంకర్ దాదా జిందాబాద్


మెగాస్టార్ చిరంజీవి హీరోగా పవన్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో నటించిన మూవీ శంకర్ దాదా జిందాబాద్. అందరి అంచనాలను తలకిందులు చేసేలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అశ్వమేధం


శోభన్ బాబు, బాలకృష్ణ ,కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందింది. మల్టీ స్టారర్ సినిమాగా అశ్వమేధం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

సుల్తాన్


ఈ సినిమాలో శోభన్ బాబు, నందమూరి బాలకృష్ణ తో పాటు రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా నటించారు. మల్టీ స్టార్ గా రూపొందిన ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడింది.

మహాసంగ్రామం


సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ మహాసంగ్రామం. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది.

కృష్ణార్జునలు


దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేక పోయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

యుద్ధం


సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోలుగా నటించిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీ లో కృష్ణ, కృష్ణంరాజు తండ్రి, కొడుకులు గా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

రామకృష్ణులు


ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా జగపతి వి. రాజేంద్రప్రసాద్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మూవీ రామకృష్ణులు. ఈ సినిమా హిందీలో అమితాబ్, వినోద్ కన్నాలు హీరోలుగా కాస్త క‌థ మార్చి రీమేక్ చేయబడింది. ఇద్దరు బడా స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీ అనుకున్న రేంజ్ లో సక్సస్ అందుకోలేకపోయింది.