విజయ్ దేవరకొండ నటించిన గత 4 సినిమాల నష్టాలు ఎంతో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదట సైడ్ క్యారెక్టర్లలో కొన్ని సినిమాలలో నటించి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.ఆ వెంటనే గీతగోవిందం సినిమాతో మంచి స్టార్ డమ్ ను అందుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే పెంచేశారు విజయ్ దేవరకొండ. దీంతో టైర్-2 హీరోలలో చోటు సంపాదించుకున్నాడు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి.. దీనివల్ల గత నాలుగు సినిమాలు కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయట.

She stopped talking to us: Vijay Devarakonda opens up about Samantha's  battle with myositis- Cinema express

క్రాంతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన వరల్డ్ ఫేమస్ మూవీ 21 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ మూవీ దాదాపుగా 60 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. ఇటీవల సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా పాజిటివ్ టాక్ వచ్చిన ఎందుకో కలెక్షన్ల పైన పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో 10 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం.

 

డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక తో కలిసి జతకట్టిన ఈ సినిమా 12 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఇలా విజయ్ దేవరకొండ సినిమాలు అన్నీ కూడా ఎన్నెన్ని కోట్లు నష్టంతో నిర్మాతలకు తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో ఒక సినిమా డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితేనే విజయ్ కెరియర్ గాడిలో పడుతుందని చెప్పవచ్చు.