బాబుపై ఐటీ ఎఫెక్ట్..అరెస్ట్‌పై ట్విస్ట్‌లు.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. షాపూర్‌జీ పల్లంజీ అనే కంపెనీ ద్వారా బాబుకు దాదాపు 118 కోట్ల రూపాయిలు ముడుపుల రూపంలో అందాయని, వాటికి లెక్కలు చెప్పాలని ఐటీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇక దీనిపై వైసీపీ నేతలు..బాబు టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబు పెద్ద అవినీతి పరుడు అని, అమరావతిలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారని ఫైర్ అవుతున్నారు.

ఇదే సమయంలో ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక దీనిపై బి‌జే‌పి నేతలు మరోలా స్పందిస్తున్నారు. అవి సాధారణంగా ఇచ్చే నోటీసులు అని వాటితో అరెస్టులు ఉండవని మాట్లాడుతున్నారు. ఇక టి‌డి‌పి నేతలు..వైసీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. అవినీతి పరులు..అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. అయితే ఐటీ నోటీసుల అంశం ఇంకా ఎంతవరకు వచ్చిందనేది క్లారిటీ లేదు. కానీ వైసీపీ నేతలు లాబీయింగ్ చేసి బాబుపై కక్ష సాధింపు చర్యలకు దిగారని టి‌డి‌పి నేతలు అంటున్నారు.

అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా బాబు సైతం స్పందిస్తూ.. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం దిగుతోందని, తనను అరెస్ట్ చేయొచ్చని అంచనా వేశారు.  తాను నిప్పునని, ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఏ కేసులో ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు.

ఇక స్టీల్ టన్నుల పేరుతో షాపూర్జీ పల్లోంజీ నుంచి నేరుగా 18.93 కోట్ల రూపాయలను చంద్రబాబు అందుకున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. బోగస్ కంపెనీలైన హయగ్రీవ- రూ.11.12 కోట్లు, షకలక, అన్నై- రూ.33.76 కోట్లు, ఎవరెట్, నయోలిన్- రూ.50.43 కోట్లు, పౌర్ ట్రేడింగ్ నుంచి 9.42 కోట్ల రూపాయలను చంద్రబాబు మళ్లించాడని అన్నారు. మొత్తానికి బాబుకు అరెస్ట్ అవుతారో లేదో గాని..ఈ ఐటీ నోటీసులపై మాత్రం రాజకీయం గట్టిగానే జరుగుతుంది.