I Bomma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ.. ఏమైందంటే..?

I Bomma: తెలుగు ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో చాలామంది థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీ కోసం ఎదురు చూడకుండా ఐ బొమ్మ (IBomma)వెంట పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐ బొమ్మ లో సినిమాలు చూస్తే తమకు రెవెన్యూ నష్టం వస్తుంది అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గొడవ పడుతున్న నేపథ్యంలో తాజాగా ఐ బొమ్మ సామాన్యులను దృష్టిలో పెట్టుకొని.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) కి వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ విడుదల చేసింది.ఇక ఆ నోట్లో ఏముంది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

iBomma APK Download 2023 (iBomma Telugu Movies)

” ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే.. మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాము.. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏమి పట్టనట్టు.. కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.ఇక హీరోలకి అంత రెమ్యునరేషన్ అవసరమా ? అది మీ కొడుకు అయినా? ఎవరైనా సరే.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.. వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు మాత్రం చెప్పకండి.. వాళ్లకు మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తుంది.. కానీ మీ హీరోకి.. హీరోయిన్ కి వస్తాయా? సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్ మరియు విదేశాలలో షూటింగ్లకు అలాగే ట్రిప్పుల కోసం ఖర్చు పెడుతున్నారు.

ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా.. అక్కడ వాళ్లకి ఉపాధి కూడా కలుగుతుంది కదా..? ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ ల మీద మీ దృష్టి పెట్టండి.. ఐ బొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ – సిగరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ.. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది. ఈ మధ్యలో వేరే ఏ హీరో కూడా టార్గెట్ అవడం ఇష్టం లేదు. మేం స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాము. ఇప్పుడు ఇమీడియట్ గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు ఉంటుంది.

అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలని అనుకుంటున్నాము. ఐ బొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్లని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము. దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా షేర్ చేయడం లేదు. మేము ఐ బొమ్మ .నెట్ వాళ్లంతా మంచి వాళ్ళం కాదు.. బురదలో రాయి వేయకండి.. అది కూడా పెంట మీద అసలు వేయకండి.. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం అందులో తెలుగువారి కోసమే ఆలోచిస్తాము అంటూ ఒక నోట్ విడుదల చేశారు.