గర్భిణీలు గ్రీన్ టీ తాగవచ్చా..?

గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ టీ.. ఇతర టీలతో పోలిస్తే హవా బాగా నడుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం, అలాగే ఇతర పోషకాలు కూడా ఉండడంతో గ్రీన్ టీ బరువు తగ్గడం, గుండె సంరక్షణ జుట్టు , చర్మ సంరక్షణ నుంచి పరిష్కారం ఇస్తుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే గ్రీన్ టీ గర్భిణీ స్త్రీలకు సహాయపడుతుందా.. గర్భిణీలు గ్రీన్ టీ తాగవచ్చా.. అనే అంశంపై చాలామందికి సందేహాలు ఉన్నాయి.

గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగాలా వద్దా తాగితే ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. గర్భం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక దశ. ఒక సమయంలో ప్రతి స్త్రీ జీవితంలో మరో జన్మ అని అంటూ ఉంటారు. అయితే అనేక మార్పులకు శ్రీకారం చుట్టే గర్భధారణ సమయంలో ఆహార ఆరోగ్యం శరీరంలోని అనేక మార్పులు రావడం సాధార‌ణం. ఇక‌ ప్రెగ్నెన్సీ టైంలో కొందరు తీపి మరికొందరు పులుపు కొందరు ఉప్పగా ఉండే ఆహారాన్ని తినాలని ఇష్టపడుతుంటారు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో గ్రీన్ టీ తాగడం సురక్షితమేనట.

గర్భధారణ సమయంలో మూడు నుంచి నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగాలి. ఈ టైంలో కేఫ్ ని తీసుకోవడం 200mg కంటే తక్కువగా ఉండాలి. ఒక కప్పు గ్రీన్ టీ లో 35 mg కెఫిన్ ఉంటుంది. అందుకే గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. టెన్షన్, వ‌త్తిడి నుంచి కూడా రిలీఫ్ ను ఇస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ గర్భిణీలు దీన్ని కొంత లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలి. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం.