ఆ స్టార్ హీరో న‌న్ను మోసం చేశాడు.. త‌ర్వాత ఎదురుపడితే క‌నీసం గుర్తుపట్టలేదు.. న‌టి కామెంట్స్..

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు గా అడుగుపెట్టి హీరో, హీరోయిన్ల స్టేజికి ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు కూడా. అలాంటి వారిలో రాజన్న సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి చిన్నారి కూడా ఒకటి. రాజన్న సినిమాలో ఎంతో అద్భుతమైన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నారి ఇప్పుడు సినిమాలలో హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇటీవల లూజ‌ర్ వెబ్ సిరీస్ లో నటించింది యాని. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులముందుకి రాబోతుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న యాని మాట్లాడుతూ నాగార్జునకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వివరించింది. తన పూర్తిస్థాయి సినిమాల్లో ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన యాని ఇప్పటికే నా డిగ్రీ కంప్లీట్ అయిందని చెప్పింది. ఇక నాగార్జున గురించి చెప్పాలంటే రాజన్న సినిమా టైంలో నాగార్జున గారు నన్ను దత్త తీసుకుంటానని చెప్పారని.. కానీ నన్ను మోసం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ వివరించింది. కొన్ని రోజుల క్రితం నాగార్జునను నేను కలిసినప్పుడు ఆయన కనీసం నన్ను గుర్తు పట్టలేదని కొంతసేపటికి గుర్తుపట్టి వచ్చి నన్ను పలకరించారని వివ‌రించింది.

ఆ టైంలో నాకు ఎంతో హ్యాపీగా అనిపించిందని చెప్పకు వచ్చింది. ఇక తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత‌ అని ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెబుతూ ఆ విషయం నాకు సరిగా గుర్తు లేదని.. నేను అనుకోకుండా ఒక రోజు సినిమా కంటే ముందుగా ఒక యాడ్లో నటించానని దానికోసం నాకు కొంత డబ్బు ఇచ్చారని ఎంత ఇచ్చారు అని అమ్మని అడగగా వేయి రూపాయలు అని సమాధానం చెప్పిందని.. అదేనా ఫస్ట్ రేమ్యూనరేషన్ అంటూ యాని వివరించింది.