బిగ్ బాస్ 7 మూడో వారం ఎలిమినేష‌న్స్ ప్రేక్ష‌కుల నిర్ణ‌యం కాదా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..!!

బిగ్‌బాస్ షో తెలుగులో ఆరు సీజన్లు పూర్తికాగా… ఏడో సీజన్ కు ఉల్టా పుల్టా అనే పేరు పెట్టి ఎవరికీ అర్థం కాకుండా నడిపేస్తున్నారు. ఏ రోజు ఏమి జరుగుతుందో కూడా ఎవరు గెస్ చేయలేకపోతున్నారు. ఈ సీజన్ మొత్తం సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్.

దీంతో పాటు ఎన్నో టాస్కులు, సర్ప్రైజులు ఇస్తూ షోను రసవతరంగా సాగిస్తున్నారు. ఈవారం నామినేషన్స్‌లో ప్రిన్స్ యావర్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, ప్రియాంక, దామిని, శుభశ్రీ ఉన్నారు. వీరిలో దామిని, సుభశ్రీ డేంజర్ లో ఉన్నట్లు తెలిసింది. దామిని ఏ ఈ వారం ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నారు.

కానీ బిగ్ బాస్ మనకి బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ఓటింగ్కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో వీళ్లు తేరుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వారంలో శుభశ్రీ ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉందని ఓటింగ్ పోల్స్ చెబుతున్నాయి.