త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్న ర‌ష్మిక మాజీ ప్రియుడు.. ఇంత‌కీ ర‌క్షిత్ కు కాబోయే అమ్మాయి ఎవ‌రు?

కన్న‌డ హీరో రక్షిత్‌ శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న్నా మాజీ ప్రియుడిగా తెలుగు ప్రేక్షకులకు కూడా రక్షిత్‌ శెట్టి సుపరిచితమే. కిరిక్ పార్టీ మూవీలో రక్షిత్‌ శెట్టి, రష్మిక జంటగా నటించారు. అప్పుడే ఇద్ద‌రూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇరుకుటుంబ సభ్యుల అంగీకరణతో గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత రష్మిక కెరీర్ పై ఫోకస్ పెట్టి స్టార్ అయ్యింది.

మరోవైపు రక్షిత్ సైతం సెలెక్టివ్ గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు చేరువ‌వుతున్నాడు. కొద్ది నెలల క్రితం 777 చార్లీ మూవీతో సౌత్ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. తాజాగా ఈయన కన్నడలో నటించిన సూపర్ హిట్ మూవీ `సప్త సాగరాలు దాటి` తెలుగులో నేడు విడుదల అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొద్దిరోజుల నుంచి హైదరాబాద్లోనే ర‌క్షిత్ ఉంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు.

త్వ‌ర‌లోనే ర‌క్షిత్ శెట్టి ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ర‌క్షిత్ ని పెళ్లి ఎప్పుడు? అని ప్ర‌శ్నించ‌గా.. అమ్మాయిలా తెగ మెలిక‌లు తిగిరిపోయాడు. త్వ‌ర‌లోనే పెళ్లి అంటూ హింట్ ఇచ్చేశాడు. అలాగే త‌న‌కు కాబోయే అమ్మాయి వివ‌రాలు కూడా అతి త్వ‌ర‌లోనే రివీల్ చేస్తా అని తెలిపాడు. దీంతో ర‌క్షిత్ క‌మిటెడ్ అని స్ప‌ర్థంగా అర్థ‌మైపోయింది. మ‌రి ఎవ‌రితో ల‌వ్ లో ఉన్నాడో తెలియ‌దు గానీ.. వీలైనంత ఫాస్ట్ గా ఆమెను ర‌క్షిత్ పెళ్లి చేసుకోవాల‌ని ఫ్యాన్స్ ఆశ‌ప‌డుతున్నారు.