ప్రేయసికి 10 నిమిషాలు ముద్దు పెట్టడంతో అది పగిలి ఆసుపత్రి పాలైన యువకుడు..!

ముద్దు పెట్టుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుందని అలాగే చాలా ప్రయోజనాలు ఉంటాయని అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఇన్ని కేలరీస్ బర్న్ అవుతాయి అంటూ నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే దంపతులు మధ్య ప్రేమ పెరగాలన్నా ముద్దు కీలకపాత్ర వహిస్తుంది. కానీ తాజాగా ముద్దు పెట్టుకోవడం వల్ల చైనాలో ఓ యువకుడు అస్వస్థకు గురై హాస్పిటల్ పాలైన సంఘటన చోటు చేసుకుంది.

అసలు విషయానికి వస్తే చైనాలోని తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెస్ట్ లేక్ సమీపంలో ఓ యువకుడు అతను ప్రియురాలని 10 నిమిషాల‌పాటు అప‌కుండా ముద్దు పెట్టుకున్నాడు. చైనీస్ వాలెంటైన్స్ డే ఆగస్టు 22న ఈ సంఘటన జరిగింది. ముద్దు పెట్టుకుంటున్న టైమ్‌లో బబ్లింగ్ శబ్దం వినిపించిందని చెవు నొప్పిగా ఉందని చెప్పడంతో ఆ వ్యక్తిని హాస్పటల్‌కి తరలించారు.

వైద్య పరీక్షలు చేసిన అనంతరం అతనికి కర్ణభేరి పగిలిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే అతను వినికిడి కోల్పోయాడట. ఇంకా కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతుంది అని డాక్ట‌ర్స్ చెప్పారు. చెవిలో ఎక్కువ గాలి వెళ్లడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.