ప్ర‌పంచంలో రాత్రి లేకుండా ప‌గ‌లు మాత్ర‌మే ఉండే దేశాలు తెలుసా..!

సాధారణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో 24 గంటలు ఉంటాయి. అందులో 12 గంటలు పగలు, మరో 12 గంటలు రాత్రి ఉంటుంది. దాదాపు అన్ని దేశాల్లో పరిస్థితి ఇలానే ఉంటుంది. భారతదేశంలో కూడా 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో పగటి సమయానికి, రాత్రి సమయానికి చాలా వ్యత్యాసాలు నెలకున్నాయి. కొన్ని దేశాల్లో పగలు ఎక్కువగా సమయం ఉండగా, మరికొన్ని దేశాల్లో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిలో పెద్దగా తేడా ఏమీ కనిపించదు. కానీ కొన్ని దేశాల్లో రాత్రి కన్నా పగలే ఎక్కువగా ఉంటుంది.

భూమిపై చీకటి కొన్ని గంటలు మాత్రమే ఉండే దేశాలు కొన్ని ఉన్నాయి. అయా దేశాల్లో దాదాపు 20 గంటలు పగలే ఉంటుంది. అంటే ఈ దేశాల్లో 20 గంటలు సూర్యుడు దర్శనమిస్తాడు. పగలు ఎక్కువగా ఉండే దేశాలు లిస్ట్‌ను ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో మూడో స్థానంలో కెనడా దేశం ఉంది. కెనడాలో వేసవి కాలం సమయంలో దాదాపు 50 రోజుల పాటు పగలే ఉంటుంది. కేవలం నాలుగు గంటలు మాత్రమే అక్కడ చీకటి పడుతుంది. రాత్రి సమయం అయితే తక్కువగా ఉండే జాబితాలో ఫిన్లాండ్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ మే నుంచి జూలై వరకు పగలే ఉంటుంది.

అంటే దాదాపు 73 రోజులపాటు పూర్తిగా సూర్యుడు కనిపిస్తాడు. అతి తక్కువ సమయం మాత్రమే ఈ దేశంలో చంద్రుడు కనిపిస్తాడు. ఇక రాత్రి అవ్వని దేశాల జాబితాలో మొదటి స్థానంలో నార్వే ఉంది. ఈ దేశంలో ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడే ద‌ర్శ‌నిమిస్తాడు. అంటే 76 రోజుల పాటు అక్కడ చీకటిని చూడలేము. అంటే ఈ మూడు దేశాల్లో కొన్ని గంటల మాత్రమే చీకటి పడుతుందన్నమాట.