తెలుగు బుల్లితెరపై లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది జబర్దస్త్ నటి రోహిణి.. మొదట సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె జబర్దస్త్ లోక వచ్చి మరింత క్రేజీ సంపాదించడంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈషో తర్వాత పలు షోలలో అవకాశాలు అందుకుంది రోహిణి.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది.
ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో కూడా నటిస్తూ వెబ్ సిరీస్లలో నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా పండుగ ఈవెంట్లలో చేసేటువంటి షోలలో ఇతర చానల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది రోహిణి. గడిచిన కొద్ది రోజుల క్రితం తన కాలుకి ఒక సర్జరీ జరిగిందని విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో తన ఎంతో బాధపడ్డానని కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే పలు రకాల షో లను మొదలు పెట్టడం జరిగింది.
తాజాగా ఒక షోలో మొదటిసారి రోహిణి తన బ్రేకప్ గురించి స్పందించినట్లు తెలుస్తోంది..ఇప్పటివరకు తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. తాజాగా తనకి ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని తెలిపింది బ్రేకప్ తర్వాత చాలా నరకాన్ని అనుభవించానని ఆ సమయంలో తన స్నేహితుల తనకు చాలా అండగా నిలిచారని తెలిపింది రోహిణి.. నా ఫ్రెండ్స్ అందరూ కూడా తన బాయ్ఫ్రెండ్ ని తన గాలిగోటికి కూడా సరిపోరూ అంటూ చెప్పడంతో తనకు కూడా అలాగే అనిపించిందని తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అనుకొని తనని వదిలేశానని తెలియజేసింది రోహిణి. ఈ సందర్భంగా రోహిణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.