లేటు మ్యారేజ్‌లో ఉన్న లాభాలు ఇన్ని ఉన్నాయా… !

ఎలాగూ వివాహాలు అనేవి ఇప్పుడు కాస్త లేట్ వయసులో చేసుకునేవి అయ్యాయి. గతంలో లేట్ మ్యారేజెస్ అనుకునేవి ఇప్పుడు అర్లీ అనబడుతున్నాయి. పాతికేళ్ల వయసులోపు పెళ్లి గురించి ఆలోచించేవారు లేరు ఇప్పుడో 20 ఏళ్లు కిందట వరకూ… కొన్ని సంప్రదాయాల్లో 20 వచ్చేసరికి పెళ్లి అయిపోవాలన్నట్లుగా ఉండేది. అయితే ఇప్పుడు ప్రాంతాలు, రాష్ట్రాలు సంబంధం లేకుండా పెళ్లి అంటే పాతికేళ్లు, ఆపైన ఆలోచించే వ్యవహారంగా మారింది. అమ్మాయిల పెళ్లిళ్లు కూడా ఇప్పుడు 28 ఏళ్లు వయసు ఆ పైన జరుగుతున్నాయి. 18 నిండగానే పెళ్లి అనేది పోయి, 28 ఏళ్ల వయసులో పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది.

The Hands Of An Indian Gujarati Bride And Bridegroom, A Ritual Performed In An Indian Gujarati Wedding, India

ఇప్పుడు కూడా అదే ఆలోచనే! ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి అవుతుందనేది అంతా తేలికగా తేలే అవకాశం లేదు. ఇక అబ్బాయిల పరిస్థితి అంతే. ఎవరైనా పెళ్లికి తొందరపడిన అంతా తేలిగ్గా పెళ్లి అయ్యే పరిస్థితి లేదు. కోరుకున్న ఫీచర్స్ తో ఉన్న పిల్ల దొరకడం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే సొసైటీలో లేట్ మ్యారేజ్ ట్రెండింగ్గా మారింది. పెళ్లి లైట్ అయిపోతుందని బెంగ పెట్టుకోకుండా సింగిల్ గా ఉన్నప్పుడు చెయ్యగల పనులన్నీ చేసుకోవచ్చుని… ఆదే లేటుగా పెళ్లి చేసుకోవడంలో ఉన్న లాభం అని వారు భావిస్తున్నారు. ఉద్యోగ పరంగా కొంతమంది పెళ్లిని లేట్ చేస్తున్నారు.

ఉద్యోగం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు సింగిల్ గా ఉన్న వారు. పెళ్లి అయితే పార్ట్నర్ కు కూడా సమయం కేటాయించడం లేదు. దీంతో ఉద్యోగ పరంగా ముందులా పని చేయలేకపోవచ్చు. దీని ప్రభావం కెరీర్ పై పడవచ్చు. అలాగే ఆర్థికంగా కూడా పెళ్లి ఆదనపు భారం. బ్యాచిలర్ గా రూమ్ షేర్ చేసుకోవచ్చు, పీజీల్లో గడపొచ్చు. అదే పెళ్లి చేసుకుంటే మొదటి నెల నుంచినే రెంట్ మీద పడుతుంది.
అలా మొదలు పెడితే ఖర్చుల జాబితా పెరుగుతుంది. మ్యారేజ్ లేట్ అవుతుంటే ఆ డబ్బులు సేవ్ అవుతున్నాయని అనుకుంటే.. లేట్ కావడం లో కూడా కొంత లాభం ఉందనుకోవచ్చు.

అలాగే పెళ్లయినప్పటి నుంచి భార్యతో ఏదో చిన్న మనస్పార్ధాలు వస్తే వాటి గురించి బాధపడటం… లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఆ ఎఫెక్ట్ మీ ఉద్యోగం మీద కూడా పడవచ్చు. ఇక పెళ్లయిన తర్వాత పిల్లలు పుడితే ఖర్చులు మరింత ఎక్కువవుతాయి. ఎందుకంటే వాళ్లకి స్కూల్ ఫీజ్‌, డ్రెస్సెస్, బుక్స్ అంటూ లక్షల్లో అవుతాయి. అదే లేట్ గా మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ కలిసొస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి సంపాదించడం అలవాటైతే ఆ తర్వాత కూడా ఈజీ అవుతుంది. లేట్ మ్యారేజ్ వల్ల విడాకుల అవకాశాలు కూడా తగ్గుతాయి.

చిన్న వయసులో అంటే పాతికేళ్లు వయసులో పెళ్లి చేసుకున్న వారు వివాహం తర్వాత గట్టిగా తగువులాడి… విడిపోయే అవకాశాలతో పోలిస్తే కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం ముందు జీవితానికి… వివాహం తర్వాత జీవితానికి చాలా తేడా ఉంటుంది. ప్రత్యేకించి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వారికి ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ మార్పుకు తట్టుకోవడం అంత తేలిక కాదు. అప్పటి వరకు తమకోసం తప్పు ఎవరి కోసం బతకని వారు… ఒక్కసారిగా పెళ్లి తో చాలా మలుపులు చూడాల్సి ఉంటుంది. ఆ మలుపులను తట్టుకోవాలంటే… వయసు కాస్త ఎక్కువగా ఉంటే మానసికంగా ఆ మార్పుకు తట్టుకోవడం ఈజీ అవుతుంది.