తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్లో టీచ‌ర్ల రాస‌లీల‌లు బ‌ట్ట‌బ‌య‌లు..!

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావించాలంటూ పాఠశాలలో నేర్పిస్తున్నారు. కానీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మంచి జ్ఞానాన్ని ఇచ్చి భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయులే తప్పుదోవ పడుతూ విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. టీచర్స్ రాసలీలల్లో మునిగి తేలుతూ విద్యావ్యవస్థను అవమానాల పాలు చేస్తున్నారు. ఇటువంటి ఉపాధ్యాయులు మాకు వద్దంటూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటువంటి సంఘటన తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా మోత మండలంలో ఊరి మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. స్కూల్లో హెడ్మాస్టర్ అక్కడ పనిచేసే మరో మ‌హిళా టీచర్ తో కలిసి రాసలీల చేస్తూ పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పగా కమిటీ సమావేశంలో ఇద్దరు తల్లిదండ్రులు వారిని అందరి ముందు నిలదీయడంతో నామమాత్రంగా ఆమెకు డిప్యూటేషన్ పై కొన్ని రోజులు వేరే పాఠశాలకు పంపారు. ఆమె తిరిగి మళ్లీ అదే పాఠశాలకు వచ్చి మళ్ళీ అసభ్యకరమైన ప్రవర్తన మొదలుపెట్టింది.

దీంతో విసిగిపోయిన గ్రామస్తులు ఆర్జేడికి లిఖిత‌ పూర్వకంగా లెటర్ తో ఫిర్యాదు చేయ‌గా విచారణకు ఆదేశించారు. ఎంక్వయిరీ టీం వస్తున్నారని సమాచారం తెలుసుకున్న ఈ ఉపాధ్యాయుల జంట విద్యార్థులను వేధించడం మొదలుపెట్టారు. స్టూడెంట్స్ తో స్కూల్ మొత్తం ఊడిపించడం, నిజం చెప్తే మీపై, తల్లిదండ్రులపై కేసులు పెడతానని బెదిరించారు. అయినా పిల్లలు అధికారుల విచారణలో హెడ్మాస్టర్, టీచర్ రాసలీలలు వివరంగా తీర్మానం చేసి వారు తిరిగి వస్తే పాఠశాలలకు తాళం వేస్తామని బెదిరించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.