రాజానగరంలో రాజాతో ఈజీ కాదే.!

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ టి‌డి‌పి అధినేత చంద్రబాబు…రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా తూర్పు గోదావరిలో పర్యటించారు. అక్కడ పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పరిశీలించారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో బహిరంగ సభ నిర్వహించారు.

అయితే ఈ సభకు అనుకున్న విధంగా జనం రాలేదు. ఇక బాబు యథావిధిగా అదే బోరింగ్ స్పీచ్‌లతో సభ ముగించేశారు. కాకపోతే రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని పరోక్షంగా టార్గెట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని మాట్లాడారు. చంద్రబాబు సభలో కరెంట్ పోతే..దానికి కారణం ఎమ్మెల్యే రాజా అన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విధంగా రాజాని టార్గెట్ చేశారు. కానీ రాజాని రాజానగరంలో ఓడించడం అనేది ఈజీ టాస్క్ కాదు. అక్కడ ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒకవేళ టి‌డి‌పి-జనసేన కలిసిన సరే రాజాకు చెక్ పెట్టడం అనేది పెద్ద టాస్క్.

గత ఎన్నికల్లో రాజానగరంలో జనసేనకు పెద్దగా ఓట్లు పడలేదు. ఇప్పుడు కూడా అంత బలం లేదు. ఇటు టి‌డి‌పికి కొత్త ఇంచార్జ్‌ని పెట్టారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సరిగా పనిచేయడం లేదని చెప్పి బొడ్డు వెంకటరమణని నియమించారు. రాజానగరంలో కాపు, కమ్మ, ఎస్సీ వర్గాల డామినేషన్ ఉంటుంది.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మూడు వర్గాలు రాజాకు మద్ధతు ఉన్నాయి. రాజా కాపు వర్గం..ఇటు టి‌డి‌పి ఇంచార్జ్ బొడ్డు కమ్మ వర్గం అయినా సరే..కమ్మ వర్గం రాజాకే మద్ధతు ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే వారికి రాజా సపోర్ట్ గా ఉంటారు. ఇటు ఎస్సీలు మామూలుగానే వైసీపీకి సపోర్ట్. కాబట్టి టి‌డి‌పి-జనసేన కలిసిన రాజానగరంలో రాజాని ఓడించడం ఈజీ కాదు.