భోళా శంకర్ సినిమాకి రిలీజ్ ముందే షాక్.. కోర్టులో కేస్ ఫైల్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సినిమాలు కచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పలేము.. అయితే ఇలాంటి విషయాలలో నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు కాస్త భేదాభిప్రాయాలు వస్తే ఖచ్చితంగా కోర్టుకు వెళుతూ ఉంటారు.. అలా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా విషయానికి వస్తే.. ఏజెంట్ సినిమా భారీ ఫ్లాప్ కావడంతో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా పేరుపొందిన బత్తుల సత్యనారాయణ భారీగా నష్టపోయారట..

 

ఏకే ఎంటర్టైన్మెంట్ వారు తమ దగ్గర రూ .30 కోట్లు తీసుకుని మోసగించారు అంటూ ఈ ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది బత్తుల సత్యనారాయణ. ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు అనిల్ సుంకర,గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని తెలియజేయడం జరిగింది బత్తుల సత్యనారాయణ. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ ను ఈ రోజున విడుదల చేశారు. ఈ ప్రెస్ నోట్లో ఏప్రిల్ ఆఖరిలో విడుదలైన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూటర్ హక్కులను మూడు రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల పాటు తనకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంటు రాసుకొని దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారంటూ ప్రెస్ నోట్ ని విడుదల చేయడం జరిగింది.

Agent distributor Gayatri Satish gives counter on producer for spreading  forgery rumors - TrackTollywood

బ్యాంకు అకౌంట్ రూపంలో తన స్నేహితుల ద్వారా రూ .30 కోట్ల రూపాయలు వైట్ మనీని ఏజెంట్ సినిమా మూడు రాష్ట్రాల హక్కుల కోసం చెల్లించానంటూ పక్క ఆధారాలతో తెలియజేశారు. అయితే వారు ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే అందజేసి అగ్రిమెంట్లకు తూట్లు పొడిచారని .. ఆ తర్వాత మే 1వ తేదీన హైదరాబాదులో వారి ఆఫీసుకు వెళ్లి గరికపాటి కిషోర్ ని కలిశాను ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు.. అయితే ఆ తర్వాత మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళగా అండర్ టేకింగ్ లెటర్ ఇస్తానని చెప్పారట.దీంతో తనకు డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మకంతో వైజాగ్ కి వెళ్లిపోయాడట బత్తుల సత్యనారాయణ. ఆ తర్వాత సామజవరగమన సినిమా డిస్ట్రిబ్యూటర్ హక్కులను విశాఖపట్నం వరకే ఇచ్చారు. ఈ సినిమాలో కొద్దిగా మాత్రమే తనకు కవర్ అయిందని తెలిపారు. ఒకవేళ 45 రోజులలోపు డబ్బు చెల్లించకుంటే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తామని ఒప్పంద పత్రం చేశారట. ప్రస్తుతం వీరి బ్యానర్ పై భోళా శంకర్ సినిమా విడుదల కాబోతోంది.ఈ విషయంలో సమాధానం చెప్పకుండా సంప్రదింపులు జరపాలని చూస్తున్నారని తనకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. దీంతో భోళా శంకర్ సినిమా విడుదల కు ముందే గట్టి షాక్ తగిలిందని వార్తలు వినిపిస్తున్నాయి.